Monday, May 6, 2024

ఢిల్లీ ప్రభుత్వం కూల్చివేతకు కుట్ర

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ఢిల్లీలో కేజ్రీవాల్ ప్రభుత్వం కూల్చివేతకు భారతీయ జనతా పార్టీ (బిజెపి) కుట్ర పన్నుతోందని, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నుంచి రాజీనామా చేసినట్లయితే ఒక్కొక్క ఎంఎల్‌ఎకు రూ. 25 కోట్లు ఇవ్వగలమంటూ ఏడుగురు ఎంఎల్‌ఎలకు బిజెపి ప్రతిపాదన చేసిందని ఆప్ శనివారం ఆరోపించింది. అయితే, బిజెపి ఆ ఆరోపణను ఖండించింది. ఆ ఎమ్మెల్యేల పేర్లను, ఆ ఆఫర్‌తో వారిని సంప్రదించిన వారి పేర్లను వెల్లడి చేయాలని ఆప్‌ను బిజెపి సవాల్ చేసింది. పార్టీ ఎమ్మెల్యేలలో ఒకరిని కాంటాక్ట్ చేసిన వ్యక్తి రికార్డింగ్ తమ వద్ద ఉందని, తరువాత దానిని ప్రదర్శించగలమని ఆప్ తెలియజేసింది. తన పార్టీ ఎమ్మెల్యేలను ‘వారు’ సంప్రదించినట్లు, ఆప్ కన్వీనర్‌ను త్వరలో అరెస్టు చేయనున్నట్లు ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్ ‘ఎక్స్’ పోస్ట్‌లో ఆరోపించారు. ఆ ఆరోపణపై ఢిల్లీ బిజెపి అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవా వెంటనే స్పందించారు. ‘కేజ్రీవాల్ ఎటువంటి సంకట స్థితిలో ఉన్నారో ఇది సూచిస్తోంది.

తన రాజకీయంగా ఇంకా చైతన్యంతో ఉన్నానని చెప్పుకునేందుకు ఆయన సత్యదూరమైన ఈ ఆరోపణ చేశారు. ఢిల్లీలోని అధికార ఆప్ ఎమ్మల్యేలలో చీలిక తీసుకురావడానికి బిజెపి ప్రయత్నిస్తోందన్న ఆరోపణ ఆయన మానసిక దివాలాకోరుతనాన్ని సూచిస్తోంది’ అని సచ్‌దేవా పేర్కొన్నారు. తాము 21 మంది ఎమ్మెల్యేలతో కాంటాక్ట్‌లో ఉన్నామని కాలర్లు తెలిపారని కేజ్రీవాల్ వెల్లడించారు. ఒక్కొక్కరికి రూ. 25 కోట్లు ఇవ్వగలమని ఎమ్మెల్యేలకు ఆఫర్ ఇచ్చారని, ఢిలీ ప్రభుత్వం కూల్చివేత అనంతరం ఎన్నికలలో పోటీ చేసేందుకు ఒక్కొక్కరికి బిజెపి టిక్కెట్ ఇవ్వగలమని వారికి వాగ్దానం చేశారని కేజ్రీవాల్ ఆరోపించారు. ఆ ఏడుగురు ఆప్ ఎమ్మెల్యేలు పార్టీ నుంచి రాజీనామాకు నిరాకరించారని కేజ్రీవాల్ తెలిపారు. ఢిల్లీలో ఆప్ ప్రభుత్వం కూల్చివేతకు గాను లిక్కర్ కుంభకోణం సందర్భంగా తనను అరెస్టు చేయించేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయని కూడా కేజ్రీవాల్ ఆరోపించారు. గడచిన తొమ్మిది సంవత్సరాలలో ఢిల్లీలో ఆప్ ప్రభుత్వం కూల్చివేతకు పలు కుట్రలు జరిగాయని, కానీ అవన్నీ విఫలమయ్యాయని కేజ్రీవాల్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News