Saturday, April 27, 2024

వినియోగ వస్తువుల రంగం 9 శాతం వృద్ధి

- Advertisement -
- Advertisement -

ఊతమందిస్తున్న గ్రామీణ మార్కెట్ రికవరీ : నివేదిక

న్యూఢిల్లీ : గ్రామీణ ప్రాంతాల్లో కొనుగోలు శక్తి మెరుగవ్వడంతో జూన్ సెప్టెంబర్ త్రైమాసికంలో భారతదేశం కన్జూమర్ గూడ్స్(వినియోగ వస్తువుల) సెక్టార్ 9 శాతం వృద్ధిని సాధించింది. ఈ త్రైమాసికంలో గ్రామీణ మార్కెట్ కోలుకోవడం వినియోగ వస్తువుల రంగానికి ఊతమందిస్తోంది. జూన్ సెప్టెంబర్ త్రైమాసికంలో గ్రామీణ ప్రాంతాల్లో విక్రయాలు 6.4 శాతం పెరిగాయి. ఈమేరకు నీల్సన్ ఐక్యూ నివేదిక వెల్లడించింది. గత నాలుగు త్రైమాసికాలను చూస్తే గ్రామీణ మార్కెట్ 2 నుంచి 5 శాతం దిగువన ఉంది. దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో కన్జూమర్ గూడ్స్ ఇప్పటికీ ఒత్తిడిని ఎదుర్కొంటోంది.

గోదుమ పిండి నుంచి పాల వరకు నిత్యావసర వస్తువుల ధరలు అధికంగా ఉండడంతో ప్రజలు ఈ వస్తువులపై ఖర్చులు తగ్గించుకోవాల్సి వచ్చింది. ధరల పెరుగుదల నెమ్మదించడం, నిరుద్యోగం తగ్గుముఖం, వంట గ్యాస్ ధరలను ప్రభుత్వం తగ్గించడం వల్ల వినియోగదారుల ఖర్చులు పెరిగే అవకాశముందని ఎన్‌ఐక్యూ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ సతీష్ పిల్లై పేర్కొన్నారు. జులైలో దేశీయ రిటైల్ ద్రవ్యోల్బణం 15 నెలల గరిష్ఠానికి చేరింది, కానీ ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో ఇది తగ్గుముఖం పట్టింది. కేంద్ర గణాంకాల ప్రకారం, సెప్టెంబర్‌లో నిరుద్యోగం 7.1 శాతానికి తగ్గగా, ఇది అక్టోబర్‌లో 10 శాతం పైనే ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News