Tuesday, May 7, 2024

ఇండియా@78,768…. రాష్ట్రాల వారిగా కరోనా వివరాలు….

- Advertisement -
- Advertisement -

Corona datails: 472 cases increased in Delhi

ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కొత్తగా 472 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఢిల్లీలో కరోనా బాధితుల సంఖ్య 8470కి చేరుకోగా 115 మంది మృత్యువాతపడ్డారు. ప్రస్తుతం భారత దేశంలో కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తోంది. గత మూడు రోజుల నుంచి రోజుకు మూడు వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. ఇండియాలో 78,768 కరోనా కేసులు నమోదుకాగా 2564 మంది చనిపోయారు. కరోనా వైరస్ నుంచి 26,675 మంది కోలుకోగా 49,524 మంది చికిత్స పొందుతున్నారు.  మహారాష్ట్రలో కరోనా వైరస్ కలవర పెడుతోంది. ఒక ముంబయిలో కరోనా కరాళ నృత్యం చేస్తుంది. ఒక్క ముంబయిలో కరోనా కేసులు దాదాపుగా 16 వేలు నమోదయ్యాయి. మహారాష్ట్రలో కరోనా బాధితుల సంఖ్య 25,922కు చేరుకోగా 975 మంది మృత్యువాతపడ్డారు. తెలంగాణలో 1367 కేసులు నమోదు కాగా 34 మంది మరణించారు. ఎపిలో 68 కొత్త కేసులు నమోదు కాగా 2205కు చేరుకున్నాయి. ఒడిశా 73, రాజస్థాన్‌లో 66, కర్నాటక 22, ఝార్ఖండ్ 4, అస్సాం 6 కేసులు నమోదయ్యాయి. ప్రపంచంలో కరోనా వైరస్ 44.30 లక్షల మందికి వ్యాపించగా మూడు లక్షల మంది బలయ్యారు. అమెరికాలో కరోనా విజృభిస్తోంది. అమెరికాలో 14.30 లక్షల మందికి కరోనా వ్యాపించగా 85 వేల మంది మృతి చెందారు. న్యూయార్క్‌లో కరోనా కలవర పెడుతోంది. న్యూయార్క్‌లో 3.50 లక్షల మందికి వ్యాపించగా 27 వేల మంది చనిపోయారు.

రాష్ట్రాల వారిగా కరోనా వివరాలు:

రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు బాధితుల సంఖ్య చికిత్స పొందుతున్నవారు కోలుకున్నవారు మృతులు
మహారాష్ట్ర
25,922 19,400 5,547 975
గుజరాత్
9,268 5,140 3,562 566
తమిళనాడు
9,227 6,987 2,176 64
ఢిల్లీ
8,470 5,310 3,045 115
రాజస్థాన్ 4,394 1,697 2,575 122
మధ్య ప్రదేశ్ 4,173 1,937 2,004 232
ఉత్తర ప్రదేశ్
3,758 1,707 1,965 86
పశ్చిమ బెంగాల్ 2,290 1,381 702 207
ఆంధ్రప్రదేశ్
2,205 965 1,192 48
పంజాబ్
1,924 1,692 200 32
తెలంగాణ 1,367 394 939 34
కర్నాటక 981 490 455 35
జమ్ము కశ్మీర్ 971 495 466 10
బిహార్
953 546 400 7
హర్యానా 793 364 418 11
ఒడిశా 611 465 143 3
కేరళ 535 41 490 4
ఛండీగఢ్
191 158 30 3
జార్ఖండ్
181 91 87 3
త్రిపుర 155 139 16 0
అస్సాం 86 43 40 2
ఉత్తరాఖండ్
72 25 46 1
హిమాచల్ ప్రదేశ్
68 27 35 3
ఛత్తీస్ గఢ్ 59 4 55 0
లడఖ్
43 21 22 0
అండమాన్ నికోబార్ దీవులు
33 0 33 0
మేఘాలయ
13 1 11 1
పుదుచ్చేరీ
13 4 9 0
గోవా 7 0 7 0
మణిపూర్ 2 0 2 0
మిజోరం
1 0 1 0
అరుణాచల్ ప్రదేశ్
1 0 1 0
దాద్రా నగర్ హవేలీ డమాన్ డయ్యూ 1 0 1 0
మొత్తం 78,768 49,524 26,675 2,564

 

దేశాల వారిగా కరోనా వివరాలు

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News