Saturday, May 4, 2024

నిరాడంబరంగా ‘జబర్దస్త్’ మహేష్ పెళ్లి..

- Advertisement -
- Advertisement -

 

‘జబర్దస్త్’ కామెడీ షోతో మంచి గుర్తింపు తెచ్చుకున్న కమెడియన్ మహేష్ వివాహం గురువారం జరిగింది. తూర్పు గోదావరి జిల్లా రాజోలు మండలం శివకోడు గ్రామానికి చెందిన తన బంధువుల అమ్మాయి పావనిని మహేష్ పెళ్లి చేసుకున్నాడు. కరోనా నేపథ్యంలో అతికొద్దిమంది బంధువులు, సన్నిహితుల సమక్షంలో ఈరోజు ఉదయం. 6.31 గంటలకు వీరి పెళ్లి నిరాడంబరంగా జరిగింది. వీరిపెళ్లికి సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో వైరల్ గా మారాయి. కాగా, మహేష్.. ‘శతమానం భవతి’, ‘రంగస్థలం’, ‘మహానటి’ చిత్రాలల్లో నటించి మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. ప్రస్తుతం మహేష్ పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు.

Jabardasth Comedian Mahesh got Married

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News