Monday, April 29, 2024

భయమే మనల్ని ఎక్కువగా చంపేస్తుంది

- Advertisement -
- Advertisement -

259170 New Corona Cases Reported in India

దేశంలో కరోనా సెకండ్ వేవ్ శరవేగంగా వ్యాప్తి చెందుతోంది. ఈ మహమ్మారి బారిన పడి పలువురు సినీ ప్రముఖులు మరణిస్తున్నారు. ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ కరోనా వల్ల మన ఆత్మీయులను కోల్పోవడం చాలా బాధాకరంగా ఉంది… గుండె తరుక్కుపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. తప్పని పరిస్థితుల్లో తెలుగు రాష్ట్రాల్లో లాక్ డౌన్ విధించారని, అందరూ ఇప్పటికైనా అన్ని జాగ్రత్తలు పాటించాలని కోరారు. ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని… అలాగే కుదిరితే డబుల్ మాస్కులు ధరించాలని సూచి ంచారు. కరోనా పాజిటివ్ వచ్చినా భయపడాల్సిన పని లేదని చిరంజీవి అన్నా రు. వైరస్ కంటే భయమే మనల్ని ఎక్కువగా చంపేస్తుందని చెప్పారు. ఒంట్లో నలతగా అనిపించినా… ఊపిరి ఇబ్బంది అనిపించినా వెంటనే డాక్టర్లను సంప్రదించాలని సూచించారు. కరోనా నుంచి కోలుకున్న వారిలో యాంటీ బాడీస్ ఉత్పత్తి అవుతాయని… వారు ప్లాస్మా డొనేట్ చేస్తే కనీసం ఇద్దరి ప్రాణాలు కాపాడినవారు అవుతారని మెగాస్టార్ చిరంజీవి అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News