Tuesday, April 30, 2024

గంజ్ తోనే వనస్థలిపురంలో కరోనా….

- Advertisement -
- Advertisement -

 

రంగారెడ్డి: వనస్థలిపురంలో కరోనా వైరస్ తో ఇద్దరు చనిపోవడంతో కలకలం సృష్టించింది. దీంతో వనస్థలిపురం ప్రాంతాన్ని కంటైన్మెంట్ జోన్‌గా ప్రకటించారు. మూడు కుటుంబాల్లో 11 మందికి కరోనా సోకడంతో ఆ ప్రాంత ప్రజలు భయాందోళనకు లోనవుతున్నారు. 139 కుటుంబాలను హోమ్ క్వారంటైన్ లో ఉండాలని అధికారులు సూచించారు. జిహెచ్‌ఎంసి అధికారు పారిశుధ్య పనులు చేపట్టడంతో పాటు హైపోక్లోరైడ్ ద్రావణం పిచికారీ చేస్తున్నారు. ఎల్‌బి నగర్ ఎంఎల్‌ఎ సుధీర్ రెడ్డి వనస్థలిపురంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. మలక్‌పేటలోని గంజ్ నుంచి ఈ ప్రాంతానికి కరోనా వైరస్ వ్యాపించిందని తెలిపారు. ప్రజలెవరూ భయపడవద్దని వైరస్ నివారణకు చర్యలు చేపట్టామని వివరించారు. భారత దేశంలో ఇప్పటి వరకు 42,670 మందికి కరోనా వైరస్ సోకగా 1395 మంది మృతి చెందారు. తెలంగాణ కరోనా బాధితుల సంఖ్య 1082కు చేరుకోగా 29 మంది మృత్యువాతపడ్డారు. ప్రపంచంలో కరోనా వైరస్ 35.66 లక్షల మందికి సోకగా 2.48 లక్షల మంది చనిపోయారు. ఒక్క అమెరికాలో 11.88 లక్షల మంది కరోనా వైరస్ సోకగా 68 వేల మంది బలయ్యారు.

రాష్ట్రాల వారిగా వివరాలు

రాష్ట్రాల వారిగా కరోనా కేసుల వివరాలు:

రాష్ట్రాలు & కేంద్రపాలిత ప్రాంతాలు
బాధితుల సంఖ్య
చికిత్స పొందుతున్నవారు
కోలుకున్నవారు మృతులు
మహారాష్ట్ర
12,974 10,311 2,115 548
గుజరాత్
5,428 4,096 1,042 290
ఢిల్లీ 4,549 3,123 1,362 64
తమిళనాడు 3,023 1,614 1,379 30
రాజస్థాన్
33,009 1,578 1,356 75
మధ్య ప్రదేశ్ 2,837 1,883 798 156
ఉత్తర ప్రదేశ్
2,645 1,848 754 43
ఆంధ్రప్రదేశ్
1,583 1,062 488 33
పంజాబ్ 1,102 964 117 21
తెలంగాణ 1,082 508 545 29
పశ్చిమ బెంగాల్ 963 762 151 50
జమ్ము కశ్మీర్ 701 406 287 8
కర్నాటక
614 295 293 25
బిహార్ 517 396 117 4
కేరళ 500 95 401 4
హర్యానా 442 192 245 5
ఒడిశా 163 102 60 1
ఝార్ఖండ్ 115 85 27 3
ఛండీగఢ్
97 77 19 1
ఉత్తరాఖండ్
60 20 39 1
ఛత్తీస్ గఢ్
57 21 36 0
అస్సాం 43 9 33 1
లడఖ్ 42 25 17 0
హిమాచల్ ప్రదేశ్ 40 1 34 2
అండమాన్ నికోబార్ దీవులు 33 1 32 0
త్రిపుర
16 14 2 0
మేఘాలయ 12 1 10 1
పుదుచ్చేరీ 12 6 6 0
గోవా 7 0 7 0
మణిపూర్ 2 0 2 0
మిజోరం 1 1 0 0
అరుణాచల్ ప్రదేశ్ 1 0 1 0
మొత్తం 42,670 29,496 11,775 1,395
Corona positive cases nine in vanastalipuram in RR

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News