Friday, May 3, 2024

40 లక్షలు దాటిన కరోనా టెస్టులు

- Advertisement -
- Advertisement -

Corona Tests Exceeding 40 lakhs in Telangana

హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా టెస్టుల సంఖ్య 40 లక్షలు దాటింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 40,17,353 మందికి పరీక్షలు చేసినట్లు ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. అంటే ప్రతి పది లక్షల మందిలో లక్షా ఏడువేలకు పైగా పరీక్షలు నిర్వహిస్తున్నామని హెల్త్ డైరెక్టర్ తెలిపారు. రాబోయే రోజుల్లో వీటి సంఖ్యను మరింత పెంచనున్నట్లు ఆయన చెప్పారు. ఇదిలా ఉండగా గురువారం 38,484 మందికి పరీక్షలు చేయగా 1421 పాజిటివ్‌లు తేలాయి.

వీరిలో జిహెచ్‌ఎంసి పరిధిలో 249 మంది ఉండగా, ఆదిలాబాద్‌లో 14, భద్రాద్రి 86,జగిత్యాల 36, జనగాం 21, భూపాలపల్లి 9, గద్వాల 13, కామారెడ్డి 35, కరీంనగర్ 75 ,ఖమ్మం 89, ఆసిఫాబాద్ 13, మహబూబ్‌నగర్ 24 , మహబూబాబాద్ 28, మంచిర్యాల 13, మెదక్ 13, మేడ్చల్ మల్కాజ్‌గిరి 111, ములుగు 28, నాగర్‌కర్నూల్ 32, నల్గొండ 79, నారాయణపేట్ 13, నిర్మల్ 6, నిజామాబాద్ 33, పెద్దపల్లి 30, సిరిసిల్లా 25, రంగారెడ్డి 97, సంగారెడ్డి 26, సిద్ధిపేట్ 57, సూర్యాపేట్ 31, వికారాబాద్ 12, వనపర్తి 24, వరంగల్ రూరల్ 23, వరంగల్ అర్బన్ లో 52, యాదాద్రిలో మరో 24 మందికి వైరస్ సోకినట్లు అధికారులు తెలిపారు. దీంతో రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 2,29,001 కి చేరగా, డిశ్చార్జ్‌ల సంఖ్య 2,07,326 కి చేరింది. అదే విధంగా వైరస్ దాడిలో ఇప్పటి వరకు 1298 మంది చనిపోయారు. అయితే ప్రస్తుతం ప్రభుత్వం ఆధీనంలో 16, ప్రైవేట్‌లో 44 కేంద్రాల్లో ఆర్‌టిపిసిఆర్ టెస్టులు నిర్వహిస్తుండగా,1076 సెంటర్లలో యంటీజెన్ టెస్టులు నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు.

ఎంపి రాములు, యాంకర్ రష్మికి కరోనా పాజిటివ్

నాగర్ కర్నూల్ ఎంపి పి రాములు కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే వెల్లడించారు. కరోనా నిర్ధారణ కావడంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు వెల్లడించారు. అయితే తనతో కాంటాక్ట్‌లోకి వచ్చిన వారంతా కోవిడ్ టెస్టులు చేయించుకోవాలని ఆయన తెలిపారు. దీంతో పాటు ఎంపి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి కూడా కరోనా సోకినట్లు ఆయన ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఆయన దుబ్బాకలోనే సెల్ప్ ఐసోలేషన్‌లో ఉండి దౌల్తబాద్ మండల ప్రచార కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు.

యాంకర్ రష్మికి పాజిటివ్

ప్రముఖ యాంకర్ రష్మికి కరోనా పాజిటివ్ సోకినట్లు సమాచారం. స్పల్ప అనారోగ్య లక్షణాలు కనిపించడంతో టెస్టు చేపించుకోగా, పాజిటివ్ వచ్చినట్లు ఆమె వెల్లడించారు. ఈనేపథ్యంలో 28 వరకు జబర్దస్త్ షూటింగ్ కార్యక్రమాలను రద్దు చేసుకున్నట్లు ఆమె తెలిపారు. ఇదిలా ఉండగా సుడిగాలి సుధీర్ కూడా కరోనా బారిన పడినట్టు ప్రచారం జరుగుతోంది. కానీ అధికారికంగా తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News