Thursday, May 9, 2024

రైతును రాజు చేయడమే టిఆర్‌ఎస్ లక్ష్యం: మంత్రి అజయ్

- Advertisement -
- Advertisement -

TRS aims to make farmer king says Minister Ajay

మధిర: రైతును రాజును చేయడమే టిఆర్‌ఎస్ ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర రోడ్డు రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, ఎంపి నామా నాగేశ్వరరావు, జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్‌రాజు పేర్కొన్నారు. శుక్రవారం మధిర మార్కెట్ కమిటీ చైర్మన్‌గా చిత్తారు నాగేశ్వరరావు, పాలక మండలి సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా హాజరైన మంత్రి అజయ్‌కుమార్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలోని టిఆర్‌ఎస్ ప్రభుత్వం రైతు సంక్షేమం కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టిందన్నారు. రైతు బంధు, రైతు బీమా, ఉచిత కరెంట్ తదితర సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి రైతులకు పెద్దపీట వేసిందన్నారు. కాంగ్రెస్ పదేళ్ళ పాలనలో రైతులు అనేక ఇబ్బందులు పడ్డారని వారు తెలిపారు.

రాష్ట్రంలోని కాంగ్రెస్ నాయకులు మాటలను ప్రజలు నమ్మరని, జాతీయస్థాయిలో కాంగ్రెస్ కనుమరుగుతుందని, సిఎం కెసిఆర్ చేస్తున్న అభివృద్ధి చూసి కాంగ్రెస్ నేతలు చేసే విమర్శలు ప్రజలు నమ్మరని తెలిపారు. మధిర మార్కెట్ కమిటీ చైర్మన్‌గా ప్రమాణస్వీకారం చేసిన చిత్తారు నాగేశ్వరరావును మంత్రి సన్మానించారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన మార్కెట్ కమిటీ చైర్మన్ చిత్తారు నాగేశ్వరరావు మాట్లాడుతూ మధిర మార్కెట్ కమిటీ పరిధిలోని రైతులందరికీ నిత్యం అందుబాటులో ఉంటూ వారి శ్రేయస్సుకు నిరంతరం కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, టిఆర్‌ఎస్ పార్టీ రాష్ట కార్యదర్శి తాత మధు, జిల్లా కలెక్టర్ ఆర్‌వి.కర్ణన్, జిల్లా రైతు సమస్వయ సమితి అధ్యక్షులు నల్లమల వెంకటేశ్వరరావు, డిసిసిబి వైస్‌చైర్మన్ దొండపాటి వెంకటేశ్వరరావు, మున్సిపల్ చైర్‌పర్సన్ మొండితోక లత, వైస్‌చైర్‌పర్సన్ శీలం విద్యాలత, జిల్లా నాయకులు బొమ్మెర రామ్మూర్తి, మొండితోక జయాకర్, టిఆర్‌ఎస్ మండల, పట్టణ అధ్యక్షులు రావూరి శ్రీనివాసరావు, దేవిశెట్టి రంగారావు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News