Tuesday, April 30, 2024

జాన్వీ కపూర్ పని మనిషికి కరోనా…. వరల్డ్@50 లక్షలు

- Advertisement -
- Advertisement -

Corona virus affected Jhanvi kapoors worker

 

ముంబయి: బాలీవుడ్ నటుడు జాన్వీ కపూర్ ఇంట్లో ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్ రావడంతో ఇంట్లో వాళ్లందరూ క్వారంటైన్‌లో ఉంటున్నారు. జాన్వీ తండ్రి బోనీ కపూర్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశాడు. బోనీ కపూర్ ఇంట్లో పని చేసే వ్యక్తికి దగ్గు, జ్వరం రావడంతో స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఆ పని మనిషికి కరోనా టెస్టు చేయగా పాజిటివ్ వచ్చింది. రెసిడెన్షియల్ కాంప్లెక్స్ సొసైటీకి మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులు సమాచారం ఇవ్వడంతో ఆ ప్రాంతాన్ని కంటైన్‌మెంట్ జోన్‌గా మార్చారు. ప్రస్తుతం అందరం క్షేమంగా ఉన్నామని, ఇంట్లో ఎవరికి కూడా కరోనా లక్షణాలు లేవని జాన్వీ వెల్లడించింది. 14 రోజుల పాటు హోంక్వారంటైన్‌లో ఉంటామన్నారు. ప్రస్తుతం మహారాష్ట్రలో కరోనా కరాళ నృత్యం చేస్తోంది. ప్రస్తుతం మహారాష్ట్రలో 37 వేల కరోనా కేసులుండగా 1325 మంది మృతి చెందారు. ఒక్క ముంబయిలోనే దాదాపుగా 23 వేల కరోనా కేసులున్నాయి. ప్రస్తుతం భారత దేశంలో కరోనా బాధితుల సంఖ్య 1.07 లక్షలకు చేరుకోగా 3315 మంది చనిపోయారు. ప్రపంచంలో కరోనా కేసుల సంఖ్య 50 లక్షలకు చేరుకోగా 3.25 లక్షల మంది మృత్యువాతపడ్డారు. రష్యాలో కరోనా విజృంభిస్తోంది. రష్యాలో కరోనా వైరస్ 3.08 లక్షల మంది సోకగా దాదాపుగా మూడు వేల మంది మరణించారు.

దేశాల వారిగా కరోనా వివరాలు:

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News