Sunday, April 28, 2024

నగరంలో విస్తృతంగా కరోనా పరీక్షలు

- Advertisement -
- Advertisement -

Coronavirus tests widely in hyderabad

హైదరాబాద్: గ్రేటర్ నగరంలో కరోనా మహమ్మారి విజృంభణ చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతుంది. ఆరునెలలుగా ప్రభుత్వ అధికారులు ఎన్ని చర్యలు చేపట్టిన వైరస్ రోజు రోజుకు విస్తరిస్తూ అమాయకులను బలిగొట్టుంది. దీంతో వైద్యశాఖ అధికారులు నగరంలో సగంమంది ప్రజలకు కరోనా టెస్టులు చేసేందుకు ఏర్పాట్లు వేగం చేసింది. జూలై 11 నుంచి గ్రేటర్ మూడు జిల్లాల పరిధిలో 196 పట్టణ ఆరోగ్య కేంద్రాలు, బస్తీ దవాఖానలో ర్యాపిడ్ యాంటీ జెన్ టెస్టులు, కేసులు ఎక్కువగా నమోదయ్యే ప్రాంతాల్లో మొబైల్ టెస్టింగ్‌లు చేస్తుంది. ప్రతి రోజు 8500మంది ర్యాపిడ్ టెస్టులు చేస్తుండగా, కింగ్‌కోఠి, చెస్ట్, నేచర్‌క్యూర్, యునానీ ఆసుపత్రులతో కలిపి నిత్యం 14వేలు మంది రక్తనమూనాలు తీసుకుని పరీక్షలు చేస్తున్నారు. అయిన కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తూ ప్రజలను హడలెత్తిస్తుంది.

ఇప్పటివరకు గ్రేటర్‌లో 52,540మంది సోకగా, 685మంది మృత్యువాత పడ్డారు. దీంతో అధికారులు టెస్టులు పెద్ద ఎత్తున చేసేందుకు ఆశ వర్కర్లు, ఎఎన్‌ఎం, అంగన్‌వాడీ కార్యకర్తలకు శిక్షణ ఇచ్చిన ర్యాపిడ్ కిట్లు ఇచ్చి బస్తీలు, కాలనీలో పరీక్షలు చేసేందుకు సిద్దమైయ్యారు. దగ్గు,జలుబు, జ్వరం వంటి లక్షణాలను కనిపిస్తే పరీక్షలు చేస్తూ , ఎక్కువ లక్షణాలుంటే గాంధీ ఆసుపత్రికి తరలిస్తూ , తక్కువ లక్షణాలుంటే హోంఐసోలేషన్‌లో ఉంచుతూ వైద్య చికిత్సలు అందిస్తున్నారు. కరోనా సోకిన వ్యక్తి చుట్టుపక్కల 10 ఇళ్లలో వ్యక్తులకు కూడ పరీక్షలు చేస్తూ హోంక్వారంటైన్‌లో ఉండాలని సూచిస్తున్నారు. ఇటీవల కేంద్రం ప్రభుత్వం పాజిటివ్ కేసులు నమోదయ్యే నగరాలను గుర్తించిన జాబితాలో హైదరాబాద్ నగరం ఉండటంతో, కరోనా సోకిన వ్యక్తి ఎంతమందిని కలిశాడో త్వరగా గుర్తించాలని, నిర్లక్షం చేస్తే వైరస్ మరింత రెచ్చిపోయే అవకాశం ఉందని పేర్కొనడంతో జిల్లా వైద్యశాఖ అప్రమత్తమై టెస్టులను నిర్వహిస్తుంది. ఆగస్టు నెలాఖరువరకు తగ్గుముఖం పడుతుందని భావించిన అధికారులు, ఇప్పట్లో తగ్గే అవకాశం లేదని అంటున్నారు.

గత వారం రోజుల నుంచి గ్రామాలకు వెళ్లిన వలస కూలీలు మళ్లీ ఉపాధి కోసం పట్టణాకి రావడంతో కరోనా రెక్కలు కట్టుకుంటుందని చెబుతున్నారు. నగరంలో వ్యాపార సముదాయాలు పూర్తిగా కార్యకలపాలు నిర్వహిస్తుండటంతో ప్రజలు రోడ్లపైకి వచ్చి ఇష్టానుసారంగా తిరుగుతూ ముఖానికి మాస్కులు ధరించకుండా,గుంపులుగా ఒకేచోట ఉండటంతో వైరస్ వ్యాపిస్తుందని పేర్కొంటున్నారు. ఏమ్రాతం లక్షణాలు కనిపించిన వెంటనే సమీపంలోని వైద్యకేంద్రాలకు వెళ్లి టెస్టులు చేయించుకోవాలని, ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో ఉచితం పరీక్షలు నిర్వహిస్తున్నట్లు, రక్తనమూనాలు ఇచ్చిన ఆరగంటలోనే ఫలితాలు వెల్లడిస్తున్నారని, ప్రజలు కరోనా విస్తరించకుండా వైద్యులు సూచించిన సలహాలు పాటించి, జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. వైరస్ పట్ల నిర్లక్షం చేస్తే కరోనా కబలిస్తుందని హెచ్చరిస్తున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News