Saturday, April 27, 2024

సీజనల్ వ్యాధిగా కరోనా

- Advertisement -
- Advertisement -
Coronavirus will become seasonal virus
లెబనాన్‌లోని అమెరికన్ వర్శిటీ ఆఫ్ బీరూట్ శాస్త్రవేత్తల అధ్యయనం

దుబాయ్ : ఒకసారి మంద రోగనిరోధక శక్తిని పొందగలిగితే సమశీతోష్ణ వాతావరణ దేశాల్లో కరోనా వైరస్ సీజనల్ వైరస్‌గా మారుతుందని, అప్పటివరకు కరోనా వైరస్ కాలాలకు అతీతంగా వ్యాప్తి చెందుతూనే ఉంటుందని లెబనాన్‌లోని అమెరికన్ యూనివర్శిటీ ఆఫ్ బీరూట్ శాస్త్రవేత్తలు తమ అధ్యయనంలో వెల్లడించారు. జర్నల్ ఫ్రాంటియర్స్ ఇన్ పబ్లిక్‌హెల్త్ లో ఈ అధ్యయనం వెల్లడైంది. జనాభాలో చెప్పుకోతగిన ఒక వర్గం కరోనా వైరస్‌ను ప్రతిఘటించే వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించుకోగలిగితే మంద వ్యాధి నిరోధక శక్తి ఏర్పడితే వ్యాధి వ్యాప్తి ప్రభావం బాగా తగ్గి కాలానుగుణ హెచ్చుతగ్గులకు అనుగుణంగా మారుతుందని పరిశోధకులు తమ అధ్యయనంలో వివరించారు. మంద రోగ నిరోధక శక్తి ఏర్పడేవరకు కరోనా ఇప్పుడు ఏడాది పొడుగునా చెలరేగుతుందని అధ్యయనానికి చెందిన సీనియర్ శాస్త్రవేత్త హస్సన్ జరకెట్ హెచ్చరించారు.

అందువల్ల ప్రజలు దానితో సహజీవనం చేయక తప్పదని, మాస్క్‌లు ధరించడం, సామాజిక దూరం పాటించడం, చేతులు పరిశుభ్రం చేసుకోవడం, గుంపులో పాల్గొనక ఉండడం తదితర వ్యాధి నిరోధక జాగ్రత్తలు కొనసాగించాలని సూచించారు. ఇదివరకటి పరిశోధనను ఉదహరిస్తూ సార్స్ కొవి2 వైరస్‌ను పోలిన ఇతర శ్వాసకోశ వైరస్‌లు కాలానుగుణంగా మారుతున్నాయని, ముఖ్యంగా సమశీతోష్ణ వాతావరణ దేశాల్లో ఇది కనిపిస్తోందని చెప్పారు. ఇన్‌ప్లూయెంజా, అనేక రకాల కరోనా వైరస్‌లు సాధారణంగా జలుబు వంటి రుగ్మతలు కలిగిస్తాయని, సమశీతోష్ణ ప్రాంతాల్లో శీతాకాలంలో తీవ్రంగా కనిపిస్తుంటాయని, ఉష్ణమండల ప్రాంతాల్లో ఏడాది పొడువునా వ్యాపిస్తుంటాయని వివరించారు.

ఈ అధ్యయనంలో పరిశోధకులు సీజనల్ వైరస్‌లను సమీక్షించారు. వైరస్‌కు ఆశ్రయమిచ్చే అంశాలు, సుస్థిరత, సార్స్ వైరస్ వ్యాప్తి ఇవన్నీ విశ్లేషించారు. ఈ అంశాలన్నీ ఈ వైరస్‌ల వ్యాప్తికి ఏడాది లోని వివిధ సమయాల్లో దోహదం చేస్తున్నాయని చెప్పారు. ఇటీవల బయల్పడిన ఎన్‌ఎల్ 63,హెచ్‌కెయు 1 వంటి ఇతర కరోనా వైరస్‌లకు సీజనల్ తత్వం కనిపించినా కొవిడ్ 19 కు మాత్రం అది వర్తించడం లేదని, దానికి కారణాలు ఇంకా తెలియరావడం లేదని అన్నారు. వేడి వేసవి సీజనైనా గల్ఫ్ దేశాల్లో కొవిడ్ 19 విపరీతంగా వ్యాప్తి చెందడాన్ని ఉదహరించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News