Sunday, May 5, 2024

పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో కరోనా పరీక్షలు పెంపు

- Advertisement -
- Advertisement -

Covid-19 tests Increased in Greater Hyderabad

హైదరాబాద్: గ్రేటర్ నగరంలో కరోనా మహమ్మారిని త్వరగా గుర్తించేందుకు వైద్యశాఖ రేపటి నుంచి టెస్టులను పెంచాలని వైద్యసిబ్బందికి ఆదేశించింది. 196 పట్టణ ఆరోగ్య కేంద్రాలు, బస్తీ దవాఖానలో రోజుకు 120మందికి చేసేందుకు ఆరోగ్య శాఖ చర్యలు చేపట్టింది. గతంలో రోజుకు 25 మందికి టెస్టులు చేసి ఆరగంటలో ఫలితాలు వచ్చేలా చేశారు. రేపటి నుంచి అన్ని కేంద్రాల పరిధిలో నిత్యం 23 వేల మందికి పరీక్షలు చేసేందుకు అధికారులు పరికరాలు సిద్దం చేస్తున్నాట్లు పేర్కొంటున్నారు. నగరంలో చలితీవ్రత పెరగడంతో చాలామంది దగ్గు, జ్వరం, జలుబు లక్షణాలతో ఫీవర్ ఆసుపత్రికి వెళ్లడంతో అక్కడ చాలామందికి చేయాలంటే కష్టంగా మారడంతో సీజనల్ వ్యాధులతో బాధపడేవారు ముందుగా కరోనా టెస్టులు చేసేందుకు స్దానికంగా ఉండే ఆరోగ్య కేంద్రాల్లో టెస్టులు చేసుకుంటే వ్యాధి నిర్దారణ అవుతుంది, వెంటనే తగిన వైద్యసేవలు పొందవచ్చన్నారు.

ప్రారంభం నుంచి టెస్టులు రోజుకు 25మందికి చేశారు, గత పదిరోజుల నుంచి స్దానికులు పరీక్షలు కోసం గంటల తరబడి ఎదురుచూడాల్సి వచ్చింది. దీంతో లక్షణాలు తీవ్రంగా ఉన్నవారు ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లి రూ. 3200లు చెల్లించి టెస్టులు చేయించుకున్నారు. ప్రైవేటుకు వెళ్లితే నెగిటివ్ వచ్చిన పాజిటివ్‌గా చూపిస్తూ ఆసుపత్రుల చేరేలా కుటుంబసభ్యులను ఒత్తిడి చేసి చేర్చుకుని రోజుకు వేల రూపాయలు బిల్లు దండుకుంటూ పేదల జీవితాలతో చెలగాటమాడుతున్నారు. నగర ప్రజలకు ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లకుండా పట్ణణ ఆరోగ్య కేంద్రాల్లో టెస్టులు పెంచుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. ర్యాపిడ్ టెస్టుల కిట్లు, సిబ్బందిని ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. ఎన్నికల ప్రచారంతో ప్రజలు పెద్ద ఎత్తున గుంపులుగా ఒకే దగ్గర ఉండటంతో వైరస్ విజృంభించి పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయని వివరిస్తున్నారు.

సభలో పాల్గొన నాయకులంతా హోంక్వారంటైన్‌లో ఉండాలని సూచించిన పట్టించుకోక పోవడంతో వైరస్ మరింత రెచ్చిపోతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంగన్‌వాడీ, ఎఎన్‌ఎంలు, ఆశవర్కర్లుల సహాయంతో రెండు రోజుల నుంచి పలు బస్తీలు, కాలనీలో ముందుగా దగ్గు,జ్వరం, జలుబు లక్షణాలున్నవారికి పరీక్షలు చేసి ఎక్కువ లక్షణాలున్నవారిని టిమ్స్ ఆసుపత్రులకు పంపేలా చర్యలు తీసుకుంటున్నారు.డిసెంబర్, జవనరి నెలల్లో కరోనా వ్యాప్తికి అనువైన సమయమని, క్రిస్‌మస్, సంక్రాంతి పండగలు ఉండటంతో ప్రజలు దుకాణాల వద్ద ఒకే దగ్గర చేరకుండా, కావాల్సిన వస్తువులు తీసుకుని వెంటనే వెళ్లిపోవాలని వైద్యులు సూచిస్తున్నారు. నిర్లక్షం చేస్తే కరోనా కబలిస్తుందని హెచ్చరిస్తున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News