Monday, May 6, 2024

టచ్ చేయకుండా పర్యవేక్షణ

- Advertisement -
- Advertisement -

Covid beep machine with indigenous knowledge

 

స్వదేశీ పరిజ్ఞానంతో అందుబాటులోకి కోవిడ్ బీప్ యంత్రం
బిపి, ఆక్సిజన్, ఉష్ణోగ్రతలను తెలుసుకునేందుకు ఉపయోగం
ఇసిఐయల్, ఇఎస్‌ఐ, నిమ్స్ శాస్త్రవేత్తలు సంయుక్తంగా తయారీ
వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రారంభించిన కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, జితేంద్రసింగ్‌లు

మన తెలంగాణ/హైదరాబాద్ : కరోనా రోగులను ముట్టుకోకుండా ఆరోగ్య పరిస్థితులను తెలుసుకునేందుకు న్వదేశీ పరిజ్ఞానంతో హైదరాబాద్ శాస్త్రవేత్తలు ప్రత్యేకమైన కిట్‌ను తయారు చేశారు. నిమ్స్, ఇసిఐఎల్, ఇఎస్‌ఐ శాస్త్రవేత్తలు సంయుక్తంగా అతి తక్కువ ఖర్చుతో కోవిడ్ బీప్ అనే పరికరాన్ని అందుబాటులోకి తెచ్చారు. దీంతో బిపి, ఆక్సిజన్, ఉష్ణోగ్రతలతో పాటు గుండె స్పందన తదితర శరీర మార్పులను వెంటనే గుర్తించవచ్చని ఆయా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అదే విధంగా కోవిడ్19 బాధితుల లొకేషన్ తో పాటు ఎలక్ట్రో కార్డియోగ్రామ్ (ఇసిజి) లను కూడా తెలుసుకోవచ్చని ఇఎస్‌ఐ సంస్థ తెలిపింది. ఈ పరికరాన్ని కోవిడ్ బాధితుడి చేతికి పెట్టి మొబైల్ ఫోన్, ల్యాప్‌టాప్‌ల ద్వారా వైద్యులు ఏ ప్రదేశంలో ఉన్న వీరి ఆరోగ్య పరిస్థితిని గమనించవచ్చని నిపుణులు చెబుతున్నారు. దీంతో వైరస్ బాధితుల పర్యవేక్షణను సులభంగా నిర్ధారణ చేసి సమయానుసారంగా చికిత్సకు ఉపయోగపడుతుందని అధికారులు పేర్కొంటున్నారు.

ఈ వైరస్‌లెస్ పరికరాన్ని ఆదివారం కేంద్ర మంత్రులు జి కిషన్‌రెడ్డి, డా జితేంద్రసింగ్‌లు వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రారంభించారు. ఈసందర్బంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ..ప్రపంచం అనేక ఆకాంక్షలు, ఆశయాలతో 2020 సంవత్సరంలోకి అడుగుపెట్టిందని, కానీ కోవిడ్-19 రూపంలో మనకు కొత్త సమస్య వచ్చి కార్యకలాపాలు నిలిచిపోయాయన్నారు. ఈ ఉపద్రవం నుంచి పిఎం మోడీ నాయకత్వంలో కరోనా నియంత్రణను సమర్ధవంతంగా ఎదుర్కొంటున్నామని తెలిపారు. లాక్‌డౌన్‌ను అమలు చేయడం వలన ఇతర దేశాల కంటే మన దగ్గర వ్యాధి తీవ్రత తక్కువగా ఉందని పేర్కొన్నారు. దీంతో పాటు ఆరోగ్యసేతు యాప్ ప్రవేశపెట్టి కాంటాక్ట్ ట్రేసింగ్ విధానానికి కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించామని చెప్పారు. దీంతో ప్రతి ఒక్కరికీ వ్యక్తిగత రక్షణను ఇవ్వగలిగామని ఆయన అన్నారు. హైదరాబాద్ శాస్త్రవేత్తలు తయారు చేసిన అద్భుత ఆవిష్కరణను ప్రారంభించటం చాలా ఆనందంగా ఉందన్నారు. కోవిడ్ మహమ్మారికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న ఇఎస్‌ఐ అధికారులను అభినందిస్తున్నానని తెలిపారు. ఈ ఆన్‌లైన్ ప్రారంభోత్సవంలో కేంద్రమంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్, ఇఎస్‌ఐ, నిమ్స్, ఇసిఐఎల్ శాస్త్రవేత్తలు పాల్గొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News