Tuesday, April 30, 2024

శ్రీశాంత్ శిక్ష ముగిసింది..

- Advertisement -
- Advertisement -

తిరువనంతపురం: స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలపై భారత మాజీ క్రికెటర్ శ్రీశాంత్‌పై విధించిన ఏడేళ్ల నిషేధం ఆదివారంతో పూర్తయ్యింది. 2013 ఐపిఎల్ సందర్భంగా స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడినట్టు శ్రీశాంత్‌పై ఆరోపణలు వచ్చాయి. దీనిపై జరిపిన విచారణలో శ్రీశాంత్ దోషిగా తేలాడు. దీంతో అతనిపై భారత క్రికెట్ బోర్డు ఏడేళ్ల నిషేధం విధించింది. ఆ నిషేధం ఇప్పుడు పూర్తయ్యింది. శ్రీశాంత్‌పై ఉన్న నిషేధం తొలగి పోవడంతో అతను మళ్లీ జాతీయ స్థాయి క్రికెట్ ఆడేందుకు మార్గం సుగమం అయ్యింది. ఇప్పటికే శ్రీశాంత్ రంజీ జట్టులోకి తీసుకుంటామని కేరళ క్రికెట్ సంఘం ప్రకటించింది. మరోవైపు శ్రీశాంత్ కూడా కఠోర సాధనతో మళ్లీ పూర్వ వైభవం సాధించేందుకు తహతహలాడుతున్నాడు. నిషేధం పూర్తి కావడంతో తనకు స్వేచ్ఛ లభించిందన్నాడు. ఇక తనకు ఎంతో ఇష్టమైన క్రికెట్‌లో మళ్లీ నిమగ్నమయ్యేందుకు తనకు అవకాశం ఏర్పడిందని వ్యాఖ్యానించాడు.

Cricketer Sreesanth’s 7 Years Ban Completed

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News