Monday, April 29, 2024

శబరిమలలో పెరిగిన భక్తుల రద్దీ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: శబరిమలలో భక్తుల తాకిడి భారీగా పెరిగింది. గంటల తరబడి క్యూలో వేచిఉన్నా దర్శనం పూర్తి కాకపోవడం వల్ల భక్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కొం దరు భక్తులు దర్శనం కాకుండానే కొండ దిగిపోతున్నట్లుగా తెలుస్తోంది. పందళంలోని అయ్యప్ప ఆలయాన్ని దర్శించుకుని అక్కడే ఇరుముడి సమర్పిస్తున్నారు. దర్శనానికి సుమారు 24 గంటల నుంచి 30 గంటలకు పైగా సమయం పడుతుండడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా రు. దీంతోపాటు అంతసేపు క్యూ లైన్‌లో ఉన్నా తమకు కనీస మంచినీళ్లు కూడా అందించడం లేదని భక్తులు ఆరోపిస్తున్నారు. భక్తుల రద్దీ ఎక్కువగా ఉండడం, గంటల కొద్ది క్యూలో ఉన్నా దర్శ నం కాకపోవడంతో భక్తులు నిరాశతో వెనుతిరుగుతున్నట్టుగా తెలిసింది.

కొందరు భక్తులు శబరిమల కొండ దిగి పందళంలో ఉన్న వలియాకోయికల్ శ్రీధర్మ శాస్త్రా ఆలయంలో అయ్యప్పకు నె య్యితో పూజలు చేసి స్వస్థలాలకు వెళ్లిపోతున్న ట్లు సమాచారం. అయ్యప్ప ఆలయంలో భక్తుల ను దర్శనం జరిగేలా చూడాలని భక్తులు పలుచో ట్ల నిరసనలు తెలుపుతున్నారు. అయితే, చాలా మంది భక్తులు పందళంలోనే అయ్యప్పకు ఇరుముడి సమర్పించి తిరుగుపయనమవుతున్నారని ఆలయ అధికారులు తెలిపారు. కొవిడ్ సమయం లో కూడా కొందరు భక్తులు ఇలానే చేశారని వారు పేర్కొంటున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News