Saturday, April 27, 2024

బలపడిన ‘ఎంఫాన్’ తుఫాన్

- Advertisement -
- Advertisement -

cyclone-amphan

హైదరాబాద్: ఆగ్నేయ బంగాళఖాతంలో ‘ఎంఫాన్’ తుఫాన్ కొనసాగుతోంది. ఈ తుఫాన్ స్వల్పంగా బలపడినట్టు భారత వాతావరణ శాఖ ప్రకటించింది. ఒడిశాలోని పారాదీప్ నకు దక్షిణంగా 990 కిలో మీటర్ల దూరంలో కేంద్రకృతమైనట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఆరు గంటలుగా గంటకు 6 కి.మీ వేగంతో ఉత్తర ఈశాన్య దిశగా ఈ తుపాను కదులుతోంది.

మరో 12గంటల్లో బలపడి తీవ్ర తుపానుగా మారుతుందని భారత వాతావరణ అధికారులు చెబుతున్నారు.  తీరానికి దగ్గరగా కదులుతూ 20వ తేదీ మధ్యాహ్నం తీరం దాటే అవకాశమున్నట్టు సమాచారం. తుఫాన్ ప్రభావంతో మోస్తారు నుంచి విస్తారంగా వర్షాలు కురిసే అవకాశముంది. ఒడిశా, బంగాల్, ఉత్తర కోస్తాంధ్రలో మోస్తారు వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి. తీర ప్రాంతాల్లో ఉండే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అదికారులు హెచ్చరించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News