Monday, April 29, 2024

బలపడుతున్న ‘నివర్’ తుఫాన్

- Advertisement -
- Advertisement -

Cyclone Nivar Live Updates

హైదరాబాద్: నైరుతి బంగాళాఖాతంలో ‘నివర్’ తుఫాన్ బలపడుతోంది. గంటకు ఆరు కిలో మీటర్ల వేగంతో తీరప్రాంతంవైపు పయనిస్తుందని వాతావరణ అధికారులు తెలిపారు. పుదుచ్చేరికి 300కి.మీ, చెన్నైకి 300కి.మీ దూరంలో నివర్ ఉంది. అర్ధరాత్రి లేదా రూపు తెల్లవారుజాము వరకు కారైకల్- మమల్లపురం మధ్య తీవ్ర తుఫాన్ తీరం దాటే అవకాశం వాతావరణ శాఖ పేర్కొంది. తుఫాన్ ప్రభావంతో గంటలకు 120-130 కిలో మీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తున్నాయి. ఈ వేగం గరిష్ఠంగా 145 కిలోమీటర్ల వరకు వెళ్లే అవకాశం ఉంది. తుఫాన్ ప్రభావంతో కర్నాటక, తమిళనాడులో నేడు, రేపు భారీ వర్షాలు పడనున్నాయి. బెంగళూరులో వరదలు వచ్చే అవకాశముందని అధికారులు హెచ్చరించారు. నివర్ తుఫాన్ ప్రభావంతో నెల్లూరు జిల్లాలో వర్షాలు మొదలైయ్యాయి. పోర్టులో రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. నెల్లూరు జిల్లాకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అక్కడికి చేరుకున్నారు.

Cyclone Nivar Live Updates

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News