Tuesday, April 30, 2024

తెలంగాణలో రేపు, ఎల్లుండి వర్షాలు

- Advertisement -
- Advertisement -

Nivar Cyclone 400 km away from Chennai

హైదరాబాద్: నివర్ తుఫాన్ నైరుతి బంగాళాఖాతంలో కేంద్రీకృతమైంది. చెన్నై, పుదుచ్చేరి తీరానికి 400 కి.మీ దూరంలో నివర్ తుఫాన్ ఉన్నట్టు వాతావరణ శాఖ పేర్కొంది. తుఫాన్ ఈనెల 25న సాయంత్రం కరైకలి, మహాబలిపురం నడుమ తీరాన్ని దాటే అవకాశం ఉన్నట్టు సమాచారం. తుఫాన్ ప్రభావంతో రాయలసీమలో భారీ నుంచి అతిభారీవర్షాలు పడనున్నాయి. నెల్లూరు, చిత్తూరుతో పాటు ప్రకాశం జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయి. నివర్ తుఫాన్ ప్రభావంతో ఇవాళ్టి నుంచి 28 వరకు తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే అవకాశముందని వాతావరణ అధికారులు తెలిపారు. రేపు, ఎల్లుండి ఒకటి రెండు చోట్ల వర్షాలు కురుస్తాయి. ఈ నెల 27,28న ఒకటి రెండు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన భారీవర్షం కురిసే అవకాశముంది. బంగాళాఖాతంలో నివర్ తుపాను ఏర్పడిన నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్ జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో ప్రత్యేకంగా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. తుపాను ప్రభావంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలందరూ అప్రమత్తం కావాలని సిఎం జగన్ హెచ్చరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News