Saturday, April 27, 2024

పుస్తక పఠనం వల్ల జ్ఞానం పెరుగుతుంది: మంత్రి హరీశ్‌

- Advertisement -
- Advertisement -

Dasarathi Krishnamacharya Birthday Celebrations

సిద్దిపేట: పుస్తక పఠనం వల్ల జ్ఞానం పెరుగుతుందని, ప్రతి ఒక్కరు పుస్తక పఠనం చేయాలని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని సిద్దిపేట విపంచి ఆడిటోరియంలో మహకవి దాశరథి కృష్ణమాచార్య 96వ జయంతిని పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి మంత్రి నివాళులు ఆర్పించి మాట్లాడారు. నా తెలంగాణ కోటి రతనాల వీణ అనే దాశరథి స్పూర్తితో ఇవాళ తెలంగాణను కోటి ఎకరాల మాగాణిగా సీఎం కేసీఆర్ నేతృత్వంలో అభివృద్ధి చేసుకుని మార్చుకున్నామన్నారు. కరువు ప్రాంతంగా ఉన్న తెలంగాణలో నేడు పసిడి పంటలు పండుతున్నాయని 3 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండించి దేశంలో మొదటి స్థానంలో తెలంగాణ రాష్ట్రం ఉన్నదని అన్నారు. దాశరథి పాటలు, ఆయన రచించిన కవితలు వింటుంటే అమృత ధారలు కురిసిన విధంగా మంచి అనుభూతి కలుగుతుందన్నారు.

నిజం, నిరంకుశ పాలనకు వ్యతీరేకంగా వీరోచితంగా, పీడతప్రజల పక్షాన పోరాడినట్లు చెప్పుకొచ్చారు. దాశరథికళలు కన్న ఊహలను తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ నిజం చేస్తున్నారని తెలిపారు. దాశరథి యాదిలో ఆయన జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుందన్నారు. దాశరథి సాహితి పురస్కారాన్ని ఏర్పాటు చేసి ప్రతి ఏటా తెలంగాణ సాహితి మూర్తులను నగదుపురస్కారాలతో సత్కరించుకుంటూ గౌరవించుకుంటున్నామని గుర్తు చేశారు. ప్రతి వ్యక్తి నిత్య విద్యార్ధి అని కోనియాడారు. సమాజంలో చైతన్యం గురించి పోరాడిన వ్యక్తి దాశరథి అన్నారు. పీడిత పక్షాన పోరాటం చేసి జైలు గోడల మీద తన పద్యాలతో పదునైన తూటాలుగా మార్చి పోరాడారన్నారు. 3 కోట్ల మెట్రిక్ ధాన్యం పండించి దేశంలోనే అత్యధిక ధాన్యం పండించిన రాష్ట్రంగా తెలంగాణ చరిత్ర పుటల్లో నిలిచింది. తెలంగాణ కోటి రతనాల వీణ అని నాడు దాశరథి అంటే నాతెలంగాణ కోటి ఎకరాల మాగాణీగా కోటి 25 లక్షల ఎకరాలకు పంట పండించే దిశగా సీఎం కేసీఆర్ మార్చారన్నారు.కరువు అనే పదాన్ని డిక్షనరీ నుంచి తెలంగాణ ప్రభుత్వం తొలగించిందన్నారు.

50 వేల ఉద్యోగాలను త్వరలో భర్తి చేయాలని కేసీఆర్ నిర్ణయించారని తెలిపారు. ఉద్యోగ భర్తికి చర్యలు తీసుకుంటున్నందున రాష్ట్రంలోని అన్ని గ్రంథాలయాలలో పోటీ పరీక్షలలో అవసరమయ్యే పుస్తకాలను అందుబాటులో ఉంచాలని రాష్ట్ర గ్రంథాలయ అధ్యక్షుడు ఆయాచితం శ్రీదర్ కు సూచించారు. అన్ని వర్గాలతో సముచిత స్థానం కల్పించేలా దళిత భాందవు అనే కార్యక్రమాన్ని సీఎం కేసీఆర్ తీసుకువచ్చారన్నారు. టీఆర్‌ఎస్‌ నాయకులు, వార్డుల కౌన్సిలర్లు ప్రత్యేక శ్రద్ద తీసుకొని యువతను సిద్దిపేట లైబ్రెరీలోపోటీ పరీక్షలకు సంసిద్దం చేసేలా ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు.అంతకు ముందు సిద్దిపేట జిల్లా గ్రంథాలయంలో వేముగంటి నర్సింహ్మచార్యులు చిత్ర పటానికి నివాళులు ఆర్పించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఫారుఖ్ హుస్సెన్, రాష్ట్ర గ్రంథాలయ అధ్యక్షుడు ఆయాచితం శ్రీదర్, సీఎం ఓఎస్టీ దేశపతి శ్రీనివాస్, కేంద్ర సాహిత్య ఆకాడమీ అవార్డు గ్రహీత, బహుబాషా వేత్త నలిమెల బాస్కర్, బీవారేజెస్ కార్పోరేషన్ మాజీ చైర్మన్ దేవీ ప్రసాద్, జిల్లా వర్కింగ్ జర్నలిస్టుల యూనియన్ అధ్యక్షుడు రంగాచారి, మార్కెట్ కమిటీ చైర్మన్ పాలసాయిరాం, ఆర్డీఓ అనంతరెడ్డి, ఇతర ప్రముఖులు తదితరులు హాజరయ్యారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News