Monday, May 6, 2024

దాసరి నారాయణరావు కుటుంబంలో ఆస్తి వివాదం..

- Advertisement -
- Advertisement -

Dasari Arun

హైదరాబాద్‌ః ప్రముఖ టాలీవుడ్ దర్శక నిర్మాత దివంగత దాసరి నారాయణ రావు సంపాదించిన ఆస్తిపై ఆయన ఇద్దరు కుమారు మధ్య వివాదం నెలకొంది. ఈ వివాదంపై తాజాగా ఆయన రెండో కుమారుడు దాసరి అరుణ్ కుమార్ మీడియాతో మాట్లాడారు. ”తనపై మా అన్యయ్య చేస్తున్న ఆరోపణలు అవాస్తవం. ఆస్తి విషయంలోనే మా మధ్య గొడవలు తప్ప ఏ గొడవలు లేవు. మా ఇద్దరి మధ్య ఏడాది నుంచి గొడవలు నడుస్తున్నాయి. 2019 మే నెలలో మా అన్నయ్య నా మీద పోలీసులకు ఫిర్యాదు చేశాడు. గతేడాది నుంచి మా అన్నయ్య డిప్రెషన్‌లో ఉన్నాడు. ఆస్తి గొడవలు ప్రతీ ఇంట్లోనూ సహజం. కుర్చొని పరిష్కరించాల్సిన సమస్యను బజారుకు ఈడ్చారు. ఈ వివాదంపై గతంలో మోహన్‌బాబు, మురళీమోహన్, సి.కళ్యాణ్ స్పందించారు. మా అన్నయ్య దగ్గర ఆస్తికి సంబంధించిన కోర్టు ఉత్తర్వులు ఏమైనా ఉంటే చూపించాలి.

ఏమైనా సమస్యలు ఉంటే న్యాయ పోరాటం చేయొచ్చు. మా నాన్న సంపాదించిన ఆస్తులల్లో ఆ ఇల్లు కూడా ఒకటి. మా నాన్న ఆ ఇల్లుని ముగ్గురి పేరు మీద రాశారు. ఆ ఇల్లు మా అన్యయ్యది కాదు.. మా ముగ్గురిది. ఆ ఇంటిపై నాకు, మా అన్నయ్యకు, మా సోదరికి సమానంగా అధికారం ఉంది.  ముగ్గురికి తెలియకుండా ఆస్తిని అమ్మే హక్కు లేదు. నా ఇంట్లో నేను గోడ దూకితే తప్పేంటి?. నేను మద్యం సేవించి గోడ దూకాననడం అవాస్తవం. మా ఫాదర్ రూమ్‌కి వెళ్లా. ఇంటి డాక్యుమెంట్ ఇవ్వాలని మా అన్నయ్యను అడిగా. నేను తెరవడానికి ప్రయత్నించానని మా అన్నయ్య చెబుతున్న లాకర్ ఎక్కడుంది?. మా అన్నయ్య ఉంటున్న ఇల్లు నాదే. నాకు వచ్చిన కొరియర్ తీసుకోవడానికే అక్కడికి వెళ్లాను. నేను పోలీసుల సమక్షంలోనే కొరియర్ తీసుకున్నాను” అని దాసరి అరుణ్ కుమార్ వివరించారు.

జూబ్లీహిల్స్ రోడ్ నెం.46లో దాసరి నారాయణ రావు కట్టిన ఇంట్లో ప్రస్తుతం ఆయన పెద్ద కొడుకు దాసరి ప్రభు కుటుంబ సభ్యులతో కలిసి ఉంటున్నాడు. అయితే, గురువారం రాత్రి మద్యం తాగిన తన తమ్ముడు అరుణ్ గోడ దూకి ఇంట్లోకి వచ్చాడని, ఆస్తి పత్రాలను తీసుకునేందుకు ప్రయత్నించాడని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు.

Dasari Arun Press Meet over Property dispute

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News