Friday, April 26, 2024

ప్రజారోగ్యం పట్టని కేంద్ర పద్దు

- Advertisement -
- Advertisement -

Medical Health

 

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆర్ధిక మాంద్యం కారణంగా కేంద్ర ప్రభుత్వానికి ఆదాయం తగ్గింది. రాష్ట్రాలపై కూడా దీని ప్రభావం పడుతుంది. ముఖ్యంగా వనరుల కొరత ఉన్న రాష్ట్రాలపై ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. నేషనల్ హెల్త్ మిషన్ కోసం కేటాయించింది 33,400 కోట్ల రూపాయలు. గత సంవత్సరం కేటాయింపు 32,994 కోట్ల రూపాయలు. కేవలం 406 కోట్ల రూపాయలు మాత్రమే పెంచారు. భారత ప్రభుత్వం అమలు చేస్తున్న ముఖ్యమైన ఆరోగ్య కార్యక్రమాల్లో నేషనల్ హెల్త్ మిషన్ ఒకటి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రజారోగ్యానికి ఇది ఎంతో కీలకమైనది. నేషనల్ హెల్త్ మిషన్‌ను జయప్రదంగా గత దశాబ్ద కాలంగా అమలు చేయడం వల్లనే గర్భిణీల ఆరోగ్య సంరక్షణ, మాతా శిశు మరణాలు తగ్గడం వంటి ఫలితాలు సాధించగలిగాము. వెనుకబడిన అనేక రాష్ట్రాల్లో ఈ ఫలితాలు కనిపించాయి. ఒడిశా, రాజస్థాన్, చత్తీస్ గఢ్, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో ఈ కార్యక్రమం చెప్పుకోదగ్గ ఫలితాలు సాధించింది.

జాతీయ ఆరోగ్య విధానం 2017 సూచించిన ప్రకారం జిడిపిలో 2.5 శాతం వైద్య ఆరోగ్య శాఖకు కేటాయించడం ఇంతవరకు సాధ్యపడలేదు. ప్రస్తుత బడ్జెట్‌లో ప్రజారోగ్యానికి చాలా తక్కువ లభించింది. 2020-21లో ప్రజారోగ్యానికి కేటాయించింది 69,233 కోట్ల రూపాయలు. గత సంవత్సరం బడ్జెట్ కన్నా ఇది కేవలం 4 శాతం మాత్రమే ఎక్కువ. ద్రవ్యోల్బణంతో పోల్చి చూస్తే ఈ పెరుగుదలకు అర్థమే లేదు. ఇందులో 65,111 కోట్ల రూపాయలు ఆరోగ్య కుటుంబ సంక్షేమ విభాగానికి కేటాయించారు. ఆయుష్ మంత్రిత్వ శాఖకు 2100 కోట్ల రూపాయలు కేటాయించారు. ఆయుష్ అంటే ఆయుర్వేద, యోగ, యునానీ, సిద్ధ, హోమియోపతి, నాచురోపతి వైద్య విధానాలు. వీటితో పాటు ఆరోగ్య పరిశోధనలకు కూడా ఇందులోనే కేటాయింపులు ఉన్నాయి. ప్రజారోగ్యానికి మొత్తం కేటాయింపు ప్రభుత్వ ఖర్చులో కేవలం 2.28 శాతం మాత్రమే. కేంద్ర, రాష్ట్ర పభుత్వాలు వైద్య ఆరోగ్య విభాగాల కోసం చేస్తున్న మొత్తం ఖర్చు జిడిపిలో కేవలం 1.18 శాతం మాత్రమే.

కేంద్ర పథకాలు అంటే, జాతీయ ఆరోగ్య మిషన్, ఆరోగ్య సంరక్షణ కార్యక్రమాలకు కేటాయింపులు కూడా పెద్దగా పెరగలేదు. 2020-21లో ఈ కార్యక్రమాలకు మొత్తం బడ్జెట్ కేటాయింపులు 39,839 కోట్ల రూపాయలు. గత సంవత్సరం ఈ ఆరోగ్య కార్యక్రమాలకు కేటాయించింది 39,551 కోట్ల రూపాయలు. కేంద్ర ఆరోగ్య పథకాలు రాష్ట్రాల ఆరోగ్య పథకాలపై కూడా ప్రభావం వేస్తాయి. ఎందుకంటే, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ పథకాలకు కలిసి ఖర్చుపెడతాయి. ఎక్కువ ఖర్చు కేంద్రం భరిస్తుంది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆర్ధిక మాంద్యం కారణంగా కేంద్ర ప్రభుత్వానికి ఆదాయం తగ్గింది. రాష్ట్రాలపై కూడా దీని ప్రభావం పడుతుంది. ముఖ్యంగా వనరుల కొరత ఉన్న రాష్ట్రాలపై ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. నేషనల్ హెల్త్ మిషన్ కోసం కేటాయించింది 33,400 కోట్ల రూపాయలు. గత సంవత్సరం కేటాయింపు 32,994 కోట్ల రూపాయలు. కేవలం 406 కోట్ల రూపాయలు మాత్రమే పెంచారు.

భారత ప్రభుత్వం అమలు చేస్తున్న ముఖ్యమైన ఆరోగ్య కార్యక్రమాల్లో నేషనల్ హెల్త్ మిషన్ ఒకటి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రజారోగ్యానికి ఇది ఎంతో కీలకమైనది. నేషనల్ హెల్త్ మిషన్‌ను జయప్రదంగా గత దశాబ్ద కాలంగా అమలు చేయడం వల్లనే గర్భిణీల ఆరోగ్య సంరక్షణ, మాతా శిశు మరణాలు తగ్గడం వంటి ఫలితాలు సాధించగలిగాము. వెనుకబడిన అనేక రాష్ట్రాల్లో ఈ ఫలితాలు కనిపించాయి. ఒడిశా, రాజస్థాన్, చత్తీస్ గఢ్, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో ఈ కార్యక్రమం చెప్పుకోదగ్గ ఫలితాలు సాధించింది. ఈ రాష్ట్రాల్లో వివిధ ప్రాంతాల్లోను, వివిధ సామాజిక సముదాయాల్లోను ఆరోగ్యపరంగా కనిపిస్తున్న తేడాలను అధిగమించడానికి మరిన్ని బడ్జెట్ కేటాయింపులతో ప్రయత్నాలు చేయవలసింది. కాని బడ్జెట్ కేటాయింపులు తగ్గించడం వల్ల ఈ కార్యక్రమాలు దెబ్బతింటాయి.

ప్రధానమంత్రి స్వాస్థ సురక్షా యోజన కోసం ఈ సారి బడ్జెట్‌లో భారీ కేటాయింపులు చేశారు. వివిధ రాష్ట్రాల్లో తృతీయ స్థాయి వైద్య సేవలు అందించడానికి ఉద్దేశించిన కార్యక్రమం ఇది. దీని కోసం మొత్తం 6420 కోట్ల రూపాయలు కేటాయించారు. గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం 2,420 కోట్ల రూపాయలు పెంచారు. ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన మరో కార్యక్రమం. 2018లో ప్రారంభించిన ఈ ఆరోగ్య కార్యక్రమం కోసం 6400 కోట్ల రూపాయలు కేటాయించారు. గత సంవత్సరం కూడా ఇదే కేటాయింపు. ఏమాత్రం పెంచలేదు. ఆరోగ్యరంగంలో చరిత్రాత్మకమైన కార్యక్రమంగా దీని గురించి ప్రచారం చేశారు. దేశంలో దాదాపు 10 కోట్ల కుటుంబాలకు, 50 కోట్ల మంది ప్రజలకు వైద్యసేవల కోసం గరిష్ఠంగా 5 లక్షల రూపాయలు అందజేసే స్కీము ఇది. దీని పట్ల కూడా ఈ సారి బడ్జెట్‌లో ఆసక్తి చూపించలేదు.

ఆయుష్మాన్ భారత్‌లో మరో ముఖ్యమైన కార్యక్రమం హెల్త్ అండ్ వెల్ నెస్ సెంటర్లు. సమాజంలో బడుగు బలహీన వర్గాలకు వైద్య సేవలందించే కేంద్రాలు. వీటి కోసం కేవలం 1350 కోట్ల రూపాయలు కేటాయించారు. గత సంవత్సరం కూడా ఇవే కేటాయింపులు. ఈ కేంద్రాలు ఔట్ పేషంట్ వైద్యసేవలు అందించే కేంద్రాలు. వీటిని సమర్థవంతంగా నడిపితే ఔట్ ఫేషంట్ వైద్యసేవలు, టీకాలు వేయడం, గర్భిణీలకు వైద్యసేవలు, మాతా శిశు సంరక్షణ సులభమవుతుంది. సాంక్రామిక వ్యాధులు కాని అనేక రుగ్మతలను ప్రారంభ దశలోనే గుర్తించి వైద్యం చేసే అవకాశం ఉంటుంది. దానివల్ల వైద్య ఖర్చులు తగ్గుతాయి. ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన జయప్రదం కావాలంటే ఆసుపత్రిలో చేరేవారి సంఖ్య తగ్గాలి. ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ కార్యక్రమాలు బలంగా ఉన్నప్పుడే అది సాధ్యపడుతుంది. అందువల్ల ఈ విభాగాలకు తగిన బడ్జెట్ కేటాయింపులు అవసరం.

పబ్లిక్, ప్రయివేట్ భాగస్వామ్యం ద్వారా ఆసుపత్రులను కట్టి వివిధ జిల్లాల్లో ఆయుష్మాన్ భారత్ సేవలు అందించే ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా గుర్తింపు పొందిన ప్రయివేటు ఆసుపత్రులు లేని జిల్లాల్లో ఇలాంటి ఆసుపత్రులు కట్టాలని ఆలోచిస్తున్నారు. మారుమూల ప్రాంతాల్లో కూడా ప్రయివేటు ఆసుపత్రులు ఏర్పడేలా ప్రోత్సహించే ఆలోచన ఇది. కాని ప్రయివేటు ఆసుపత్రులను ప్రోత్సహించడంతో పాటు జిల్లా ఆసుపత్రులను అభివృద్ధి చేయడం కూడా చాలా అవసరం. కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన కేరింగ్ ఇండియా కార్యక్రమంలో ఆరోగ్య రంగం ముఖ్యమైనది. వైద్య ఆరోగ్య రంగంలో అనేక సవాళ్ళు మన ముందున్నప్పుడు ప్రాధాన్యతలు కూడా దానికి అనుగుణంగానే ఉండాలి.

2018లో ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన ప్రకటించినప్పుడు రాజకీయాల్లో ప్రజారోగ్యం గురించి మాట్లాడడం ఎక్కువయ్యింది. ప్రజారోగ్యానికి ప్రాధాన్యత పెరిగింది. ఇది మరుగున పడిపోరాదు. ప్రజారోగ్యానికి ప్రాముఖ్యం ఇస్తూ జిడిపిలో 2.5 శాతం వైద్యఆరోగ్య రంగాలకు కేటాయించే స్థాయికి చేరుకోవాలి. అభివృద్ధి చెందిన దేశాల్లోను, వర్థమాన దేశాల్లోను అతి తక్కువగా ప్రజారోగ్యం కోసం ప్రభుత్వం ఖర్చుపెడుతున్న దేశంగా భారతదేశానికి ఉన్న పేరును మార్చాలి. ప్రజారోగ్యానికి కేటాయింపులు పెంచాలి.

Decreased funding for Department of Medical Health
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News