Monday, April 29, 2024

డిగ్రీ విద్యార్థిని అదృశ్యం

- Advertisement -
- Advertisement -

Degree student missing in Hyderabad

హైదరాబాద్: డిగ్రీ విద్యార్థిని అదృశ్యమైన సంఘటన హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రసమోని మీనాక్షి(19) అనే యువతి యూసుఫ్ గూడ పోలీస్ లైన్స్ లో నివాసం ఉంటుంది. మే11న డిగ్రీ చదువుతున్న యువతి ఇంట్లో నుంచి బయటకు వెళ్లి తిరిగిరాలేదు. తండ్రి వెంకటయ్య బంధువులు, స్నేహితుల ఇండ్లలో వెతికిన కూడా ఆమె కనిపించలేదు. వెంకటయ్య తన కూతురు కనిపించడంలేదని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని ఆమ కోసం గాలిస్తామని తెలిపారు. ఆమె ఆచూకీ తెలిస్తే 8185855212, 9346249416 నంబర్లకు సమాచారం ఇవ్వాలని కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News