Saturday, April 27, 2024

నివురుగప్పిన నిప్పులా ఢిల్లీ

- Advertisement -
- Advertisement -

delhi-violence

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ నివురుగప్పిన నిప్పులా మారింది. ఢిల్లీలో సిఎఎ వ్యతిరేక ఆందోళనలు తీవ్ర ఉద్రిక్తతకు దారి తీస్తున్నాయి. ఈశాన్య ఢిల్లీలో ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. సమస్యాత్మకంగా మారిన మౌజ్‌పూర్‌, జఫ్రాబాద్‌, భజల్ పూర్, ఛాంద్ బాగ్, కారావల్ నగర్, బాబర్ పూర్ ఏరియాల్లో కర్ఫ్యూ విధించారు. మంగవారం నుంచి కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులు అమలులోనికి వచ్చాయి. ఈశాన్య ఢిల్లీలోని ప్రైవేటు, ప్రభుత్వ పాఠశాలలకు బుధవారం సెలవు ప్రకటించాయి విద్యాసంస్థలు. ఇవాళ జరగాల్సిన పది, పన్నెండో తరగతి పరీక్షలను వాయిదా వేస్తున్నట్టు సిబిఎస్ ఇ వెల్లడించింది. సమస్యాత్మక ప్రాంతాల్లో నిన్న రాత్రి నుంచి సాయుధ బలగాలు కవాతు నిర్వహిస్తున్నాయి.

దీంతో పరిస్థితిని  జాతీయ భద్రతా సలహాదారు దోవత్ క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నారు. ఘజియాబాద్ జిల్లాకు మూడు వైపులా ఉన్న సరిహద్దులను మూసివేశారు. ఢిల్లీలో అల్లర్లు తదనంతరం పరిణామాలను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అనుక్షణం సమీక్షిస్తున్నారు. 24 గంటల్లో మూడు సార్లు అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. ఎప్పటికప్పుడు అధికారులకు ఆదేశాలను ఇస్తూ పరిస్థితిని అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు అమిత్ షా. ప్రజలు సంయమనం పాటించాలని పిలుపునిచ్చారు. బుధవారం అమిత్ షా త్రివేండ్రంలో పర్యటించాల్సిఉంది. పద్మ విభూషన్ పరమేశ్వరన్ ప్రేర్ కు హాజరుకావాల్సింది. అయితే ఢిల్లీ అల్లర్ల కారణంగా ఆయన పర్యటన వాయిదా పడింది.

కాగా ఈ అల్లర్లలో మృతుల సంఖ్య 18కి చేరింది. హింసాత్మక ఘటనలపై ఢిల్లీ హైకోర్టు, సుప్రీంకోర్టులో నేడు విచారణ జరగనుంది. దేశరాజధానిలో జరుగుతున్న అల్లర్లపై సమాచార మాజీ కమిషనర్ వజాహత్ హబీబుల్లా, మరికొందరుదా దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు మంగళవారం అంగీకరించింది. పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ)పై దేశ రాజధానిలో ప్రస్తుతం జరుగుతున్న హింసాకాండగురించి వచ్చిన ఫిర్యాదులపై ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసేందుకు ఢిల్లీ పోలీసుల్ని ఆదేశించాలని వారు ఆ పిటిషన్‌లో సుప్రీంకోర్టును కోరారు. అత్యవసరంగా విచారణ జరపాల్సిన పిటిషన్‌గా పరిగణించింది.

delhi violence over caa protests live updates

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News