Monday, April 29, 2024

ఎగవేతదార్లకు ఎర్రతివాచీ

- Advertisement -
- Advertisement -

Deliberate defaulters waive loans

డిఫాల్టర్ల జాబితాలో మెహుల్‌చోక్సీ, విజయ్‌మాల్యా, సందీప్, సంజయ్ ఝన్‌ఝన్, డైమండ్ వ్యాపారి జతిన్ మెహతా, కొఠారి గ్రూప్, కుడోస్ చెమీ, బాబా రాందేవ్ సహా పలువురు ప్రముఖులు
ఆర్‌టిఐ కింద
సమాచారమిచ్చిన ఆర్‌బిఐ

ఉద్దేశపూర్వక ఎగవేతదారుల విషయంలో పలు ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. దాదాపు 50 మందికి సంబంధించిన రూ.68,607 కోట్ల రుణాలను దేశ బ్యాంకులు సాంకేతికంగా మాఫీ చేశాయి. విదేశాలకు పారిపోయిన వ్యాపారులు మెహుల్ చోక్సీ, విజయ్ మాల్యా ఈ ఎగవేతదారుల జాబితాలో ఉన్నారు. ఆర్‌టిఐ కింద ఆర్‌బిఐ ఈ సమాచారం ఇచ్చింది. సెంట్రల్ బ్యాంక్ నుండి 50 మంది ఉద్దేశపూర్వక ఎగవేతదారుల వివరాలు, వారు తీసుకున్న రుణాల స్థితిగతుల గురించి ఆర్‌టిఐ కార్యకర్త సాకేత్ గోఖలే కోరారు. ఫిబ్రవరి 16న పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో కాంగ్రెస్ ఎంపి రాహుల్ గాంధీ అడిగిన ప్రశ్నకు సమాధానం ఇవ్వడానికి ఆర్థిక మంత్రి నిర్మల నిరాకరించినందున ఆర్‌టిఐ కింద ఈ సమాచారాన్ని సేకరించినట్టు గోఖలే చెప్పారు.

ముంబై: ఆర్‌టిఐ(సమాచార హక్కు చట్టం) కింద ఉద్దేశపూర్వక ఎగవేతదారుల విషయంలో పలు ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. దాదాపు 50 పెద్ద ఉద్దేశపూర్వక ఎగవేతదారుల రూ.68,607 కోట్ల రుణాలను దేశ బ్యాంకులు సాంకేతికంగా మాఫీ చేశాయి. విదేశాలకు పారిపోయిన వ్యాపారులు మెహుల్ చోక్సీ, విజయ్ మాల్యాలు కూడా ఈ ఉద్దేశపూర్వక ఎగవేతదారుల జాబితాలో ఉన్నారు. సమాచార హక్కు (ఆర్‌టిఐ) చట్టం కింద ఆర్‌బిఐ (భారతీయ రిజర్వు బ్యాంక్) ఈ సమాచారం ఇచ్చింది. సెంట్రల్ బ్యాంక్ నుండి 50 మంది ఉద్దేశపూర్వక ఎగవేతదారుల వివరాలు, వారు తీసుకున్న రుణాల స్థితిగతుల గురించి ఆర్‌టిఐ కార్యకర్త సాకేత్ గోఖలే కోరారు. ఫిబ్రవరి 16న పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో కాంగ్రెస్ ఎంపి రాహుల్ గాంధీ అడిగిన ప్రశ్నకు సమాధానం ఇవ్వడానికి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఆర్థిక మంత్రి అనురాగ్ ఠాకూర్ నిరాకరించినందున ఈ ఆర్‌టిఐని దాఖలు చేశానని గోఖలే చెప్పారు. ప్రభుత్వం అందించని సమాచారాన్ని ఆర్‌బిఐ ఏప్రిల్ 24న ఇచ్చినట్లు గోఖలే చెప్పారు. ఈ మొత్తం రూ. 68,607 కోట్లు 2019 సెప్టెంబర్ 30 వరకు సాంకేతికంగా మాఫీ చేసినట్టు ఆర్‌బిఐ తెలిపింది.

పెద్ద డిఫాల్టర్లు వీరే..
ఈ ఎగవేతదారుల జాబితాలో రూ.5,492 కోట్ల అప్పు ఉన్న మెహుల్ చోక్సి సంస్థ గీతాంజలి జెమ్స్‌అగ్రస్థానంలో ఉంది. ఇవే కాకుండా గిల్లి ఇండియా లిమిటెడ్, నక్షత్ర బ్రాండ్స్ వరుసగా రూ.1,447 కోట్లు, రూ.1,109 కోట్లు రుణాలు తీసుకున్నాయి. చోక్సి ప్రస్తుతం ఆంటిగ్వాలో ఉన్నాడు. చొక్సీ మేనల్లుడు, పారిపోయిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీ ప్రస్తుతం లండన్‌లో ఉన్నాడు. ఈ జాబితాలో రెండో స్థానంలో రీ ఆగ్రో లిమిటెడ్ పేరు ఉంది, ఈ సంస్థ రుణం రూ.4,314 కోట్లు. ఈ సంస్థ డైరెక్టర్లు సందీప్ ఝున్‌ఝున్‌వాలా, సంజయ్ ఝున్‌ఝున్‌వాలా ఏడాది నుండి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తులో ఉన్నారు. ఈ జాబితాలో తర్వాత రూ.4,076 కోట్ల అప్పు ఉన్న పారిపోయిన డైమండ్ వ్యాపారి జతిన్ మెహతా సంస్థ వినమ్ డైమండ్ అండ్ జ్యువెలరీ రూ.4000 కోట్ల రుణం తీసుకుంది. రూ .2000 కోట్ల కేటగిరీలో కాన్పూర్ కేంద్రంగా పనిచేస్తున్న రోటోమాక్ గ్లోబల్ ప్రైవేట్ లిమిటెడ్, ఇంకా రూ.2850 కోట్ల అప్పుతో ప్రసిద్ధ కొఠారి గ్రూప్ సంస్థ జాబితాలో ఉన్నాయి.

ఇవే కాకుండా పంజాబ్‌కు చెందిన కుడోస్ చెమీ (రూ .2,326 కోట్లు), బాబా రామ్‌దేవ్, బాలకృష్ణ కంపెనీ గ్రూప్ ఇండోర్‌కు చెందిన రుచి సోయా ఇండస్ట్రీస్ (రూ .2,212 కోట్లు), గ్వాలియర్స్ జూమ్ డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ (రూ .2,012 కోట్లు)ను ఈ జాబితాలో చేర్చారు. బ్యాంకులను మోసం చేసిన ఈ 50 పెద్ద ఉద్దేశపూర్వక ఎగవేతదారులలో, ఆరుగురు వజ్రం, బంగారు ఆభరణాల వ్యాపారంలో ఉన్నవారే. గోఖలే మాట్లాడుతూ, వీరిలో ఎక్కువ మంది సంవత్సరాలుగా ప్రధాన జాతీయ బ్యాంకులను మోసం చేశారు. చాలా మంది దేశం నుండి పారిపోయినవారు లేదా వివిధ దర్యాప్తు సంస్థలో దృష్టిలో ఉన్నారని అన్నారు.

Deliberate defaulters waive loans
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News