Monday, April 29, 2024

వెనుకబాటు నుంచి ముందు వరుసలోకి..

- Advertisement -
- Advertisement -

Mahabubnagar at the grain export level

 

ఒకప్పటి వలసల జిల్లా పాలమూరు నుంచి కేరళకు బియ్యం ఎగుమతి
ముఖ్యమంత్రి కృషి వల్లే ఇది సాధ్యమైందని
రైల్వే మంత్రి పీయూష్ ట్వీట్‌కు స్పందించిన
మంత్రి కెటిఆర్

మనతెలంగాణ/హైదాబాద్: దేశంలో అత్యంత పేదజిల్లాగా ఉన్న మహబూబ్‌నగర్ జిల్లాను సిఎం కెసిఆర్ ప్రణాళికాబద్దంగా అభివృద్ధి చేయడంతో ఈ జిలా ్లఇతర రాష్ట్రాలకు ధాన్యం ఎగుమతి చేసే స్థాయికి చేరుకుందని రాష్ట్ర మంత్రి, టిఆర్‌ఎస్ వర్కంగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఆనందం వ్యక్తం చేశారు. ఈ మేరకు రైల్వే శాఖ మంత్రి పియుష్ గోయల్ కార్యాలయం చేసిన ట్విట్‌కు కెటిఆర్ స్పందిస్తూ కొన్ని సంవత్సరాల క్రితం వరకు దేశంలోనే అత్యంత వెనుకబడిన జిల్లాల్లో ఒకటైన ఈ జిల్లా ఇప్పుడు ధాన్యం ఎగుమతి చేసే స్థాయికి వచ్చిందని సంతోషం వ్యక్తం చేశారు.

మహబూబ్‌నగర్ జిల్లా నుంచి కేరళలోని పయ్యనుర్, వెస్ట్ హిల్స్‌కు బియ్యాన్ని సరఫరా చేస్తున్నట్లు కేంద్ర రైల్వే శాఖ మంత్రి పియుష్ గోయల్ కార్యాలయం ట్విట్ చేసింది. రైల్వే సిబ్బంది సామాజిక దూరం, పరిశుభ్రత నియమాలను పాటిస్తూ మహబూబ్‌నగర్ నుంచి కేరళకు బియ్యం సరఫరా చేస్తున్నట్లు ట్విట్టర్‌లో తెలిపారు. ఈ ట్విట్‌ను ట్యాగ్ చేస్తూ కెటిఆర్ స్పందించారు. ప్రస్తుత మహబూబ్‌నగర్ జిల్లా కొన్ని సంవత్సరాలక్రితం దేశంలోనే అత్యంత వెనుకబడిన జిల్లాల్లో ఒకటని గుర్తు చేశారు. అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ కృషితో ఈ జిల్లా ఎంతో అభివృద్ధి చెందిందన్నారు.

ఆకలికేకల నుండి అన్నపూర్ణగా
ఆరేళ్లలో ఆకలికేకల నుండి అన్నపూర్ణగా పాలమూరు జిల్లా మారిందని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి కూడా ట్వీట్ చేశారు. పీయుల్ గోయల్ ట్వీట్‌కు రీప్లై చేసిన మంత్రి ప్రగతిపథాన పాలమూరు, వలసల జిల్లాకే వలసలొచ్చే దిశగా అని పేర్కొన్నారు.

Mahabubnagar at the grain export level
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News