Saturday, April 27, 2024

స్ట్రాంగ్ లీడర్ కెసిఆర్ చేతిలోనే తెలంగాణ అభివృద్ధి: హరీశ్ రావు

- Advertisement -
- Advertisement -

రాంగ్ లీడర్ చేతిలోకి వెళ్లితో మళ్లీ వెనక్కే
తెలంగాణ అభివృద్ధి కెసిఆర్‌కు టాస్క్..మిగిలిన వారికి పదవులే లక్ష్యం
హెల్త్ హబ్‌గా మారిన తెలంగాణ
బిఆర్‌ఎస్‌లో చేరిన తెలంగాణ ఐఎంఏ డాక్టర్లు
పార్టీలోకి స్వాగతించిన వైద్యశాఖ మంత్రి హరీశ్ రావు

మన తెలంగాణ/హైదరాబాద్: స్ట్రాంగ్ లీడర్ కెసిఆర్ చేతిలోనే తెలంగాణ అభివృద్ధి పురోగమిస్తోందని వైద్య,ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. కొందరు రాంగ్ లీడర్లు పదవుల కోసం ప్రజల్ని మభ్యపెడుతున్నారని ఆయన విమర్శించారు. తెలంగాణ ప్రజలు రాంగ్ లీడర్లను కాకుండా స్ట్రాంగ్‌లీడర్లనే గెలిపించుకోవాలన్నారు. గురువారం తెలంగాణ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో ఐఎంఏ తెలంగాణ వైద్యులు మంత్రి హరీశ్ రావు సమక్షంలో బిఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో హరీశ్‌రావు మాట్లాడుతూ తెలంగాణ ప్రజలు స్ట్రాంగ్ లీడర్ కావాలా, రాంగ్ లీడర్ కావాలా అన్నది ఆలోచించాలన్నారు. కెసిఆర్ తన ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా రాష్ట్రం సాధించాడు. తెలంగాణ పట్ల ఆయనకున్న ప్రేమ మరెవ్వరికీ ఉండదన్నారు.

పదవుల కోసమే ఇతర పార్టీలు
తెలంగాణలో మిగతా రాజకీయ పార్టీలది పదవుల కోసం చేసే ప్రయత్నమేనని హరీశ్ రావు విమర్శించారు. తెలంగాణను కేసీఆర్ ఒక టాస్క్ లాగా భావించి అభివృద్ధి చేస్తున్నారని చెప్పారు. 60 ఏండ్ల కరెంట్ కోతలను ప్రతి ఒక్కరూ చూశారు. ప్రస్తుతం నిరంతర విద్యుత్ సరఫరాను చూస్తున్నరని అన్నారు.గతంలో ఎంబీబీఎస్ చదవాలంటే పక్క దేశాలకు వెళ్లాల్సిన పరిస్థితి.నేడు తెలంగాణలో ఉంటూనే ఎంబీబీఎస్ చదివే అవకాశం వుందని, జిల్లాకో మెడికల్‌కాలేజీ ఏర్పాటు చేసిన ఘనత కేసీఆర్‌దేనని అన్నారు. ప్రజలకు మంచి చేసే పనులు పత్రికల్లో ఎక్కువగా కనపడటం లేదు.కానీ ఎదుటి వారిని తిడితే వార్తల్లో ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారని పేర్కొన్నారు.పేపర్ లీడర్ కావాలా, ప్రాపర్ లీడర్ కావాలా? అన్నవిషయాన్ని ప్రజలు ఆలోచించాలన్నారు.

హెల్త్‌హబ్‌గా తెలంగాణ:
హైదరాబాద్ హెల్త్ హబ్ గా ఎదిగింది. ఫార్మా హబ్ గా ఎదిగింది. ఐటీ హబ్ గా ఎదిగింది. ధాన్యం ఉత్పత్తిలో నెంబర్ వన్, వైద్యుల ఉత్పత్తిలో నెంబర్ వన్‌గా తెలంగాణ మారిందన్నారు. నాడు బెంగాల్ ఆచరిస్తే, దేశం అనుసరిస్తది అనే వారు, దాన్ని తిరగరాసి తెలంగాణ ఆచరిస్తే, దేశం అనుసరిస్తది అనేంతగా అభివృద్ధి చేశామని అన్నారు.గ్రామీణ అవార్డుల్లో 38శాతం అవార్డులు తెలంగాణకే వచ్చాయి.మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికి నీళ్లు అందించిన తెలంగాణ పథకాన్ని కేంద్రం హర్ ఘర్ కో జల్ అని కాపీ కొట్టిందని మంత్రి హరీశ్ రావు గుర్తుచేశారు.మేము మిషన్ కాకతీయ ద్వారా చెరువులు బాగు చేస్తే కేంద్రం అమృత్ సరోవర్ అని కాపీ కొట్టింది.దేశాన్ని రక్షించే సైనికులు, అన్నం పెట్టే రైతులకు, ప్రాణం కాపాడే వైద్యులకు ఎంతో విలువ ఉంది.అలాంటి రైతుల కోసం రైతు బంధు ఇచ్చిన ఘనత సీఎం కెసిఆర్‌దేనని హరీశ్ రావుపేర్కొన్నారు.

తెలంగాణ పథకాలు కాపీకొట్టిన కేంద్రం:
రైతు బంధును సైతం కేంద్రం కాపీ కొట్టి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పేరుతో అమలు చేస్తున్నదని హరీశ్ రావు అన్నారు. అయితే మనం పది వేలు ఇస్తే, కేంద్రం మూడు వేలే ఇస్తోందన్నారు. విశ్వకర్మలకు లక్ష ఆర్థిక సాయం అంటే, దాన్ని కేంద్రం కాపీ కొట్టి విశ్వ కర్మ యోజన అని ప్రారంభించింది. తెలంగాణ ప్రభుత్వం లక్ష ఆర్థిక సాయం ఇస్తే, కేంద్రం మాత్రం అప్పు రూపంలో ఇస్తున్నదని తెలిపారు.మక్కీకి మక్కీ తెలంగాణ పథకాలను కేంద్రం కాపీ కొడుతున్నదని అన్నారు.తెలంగాణ పథకాలు అనేక రాష్ట్రాల్లో అమలవుతున్నాయన్నారు.కల్యాణ లక్ష్మీ గుణాత్మక మార్పుకు శ్రీకారం చుట్టింది. సామాజిక మార్పుకు నాంది పలికిందన్నారు.

మిషన్ భగీరథతో అద్భుతాలు:
మిషన్ భగీరథ పధకంతో ఎన్నో అద్బుతాలు జరిగాయని హరీశ్‌రావు అన్నారు. శుద్ధి చేసిన నీటి ద్వారా రోగాలు తగ్గాయి.పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి, మిషన్ భగీరథ ద్వారా సీజనల్ డిసీజ్ తగ్గాయి.గతంలోసమ్మర్ యాక్షన్ ప్లాన్ అని నాడు వెయ్యి కోట్లు ఖర్చు చేసేవారు.బోరింగులు హైర్ చేసుడు, హ్యాండ్ పంప్ రిపేర్లు, మోటార్లు రిపేర్లు పేరిట ప్రతి ఏటా వృథా అవుతుండేది. కానీ మిషన్ భగీరథ వచ్చాక, సమ్మర్ లేదు యాక్షన్ లేదు ప్లాన్ లేదన్నారు. మిషన్ భగీరథ ద్వారా గొప్పమార్పు వచ్చిందని,ప్రతి పథకం వెనుక సామాజిక కోణం దాగి ఉందని హరీశ్ రావు వివరించారు.

ప్రభుత్వాస్పత్రులకు ఆదరణ:
తెలంగాణలో ప్రభుత్వ ఆసుపత్రులు ఎంతో అభివృద్ధి చెందాయని మంత్రిహరీశ్ రావు తెలిపారు. 2014లో 30శాతం డెలివరీలు జరిగితే, ప్రస్తుతం 72.8శాతం జరుగుతున్నాయన్నారు. కెసిఆర్ కిట్ల పంపిణీ, గర్భిణులకు వివిధ రకాల పధకాలను ప్రభుత్వం అమలు చేస్తున్నదని అన్నారు.

వ్యవసాయ రంగం అభివృద్ధి:
వ్యవసాయ రంగం బలోపేతం ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అయ్యిందని మంత్రి హరీశ్ రావు తెలిపారు. కేసీఆర్ రైతును బలోపేతం చేశారు. తద్వారా వ్యవసాయం బలోపేతం అయ్యిందన్నారు. తెలంగాణలో ఎకరం అమ్మితే, ఆంధ్రలో వంద ఎకరాలు వస్తయని మొన్న చంద్రబాబు అన్నడు. 9 ఏండ్ల తెలంగాణ అభివృద్ధి ప్రయాణంలో సీఎం కేసీఆర్ శ్రమ ఎంతో దాగి ఉందని,24 గంటల ఉచిత కరెంట్ ఇచ్చే రాష్ట్రం తెలంగాణ తప్ప దేశంలో మరొకరాష్ట్రం లేదన్నారు.పొలిటికల్ స్టెబిలిటీ ఉంది కాబట్టి శాంతి భద్రతల సమస్య లేదు.అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించి, దేశానికి తెలంగాణ రోల్ మోడల్ అయ్యిందని మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు.మూడో సారి కెసిఆర్‌ను సిఎం చేసేందుకు అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలోమంత్రులు గంగుల కమలాకర్, ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మెన్ వినోద్ కుమార్,ఐఎంఎ స్టేట్ ప్రెసిడెంట్ బిఎన్ రావు, వివిధ జిల్లాల అధ్యక్షులు, వైద్యులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News