Saturday, April 27, 2024

ధరణి దరఖాస్తులను త్వరితగతిన పరిష్కారించాలి

- Advertisement -
- Advertisement -

ఆసిఫాబాద్: ధరణి పోర్టల్‌లో వచ్చిన దరఖాస్తులను త్వరితగతిన పరిష్కారించే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ బోర్కడే హేమంత్ సహదేవ్‌రావు అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవన సమావేశ మందీరంలో జిల్లా అదనపు కలెక్టర్ రాజేశంతో కలిసి అధికారులతో ధరణి ప్రక్రియపై సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా మాట్లాడుతూ ధరణిలోని 33 మాడ్యూల్స్ ద్వారా అం దిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి రికార్డులను అనుసరించి పూర్తిస్థాయి నివేదిక రూపోందించి అందించాలని తెలిపారు. ధరణిలో వచ్చిన దరఖాస్తులను త్వరితగతిన పరిష్కారించి జిల్లాను ముందంజలో ఉంచేందుకు కృషి చేయాలని తెలిపారు.

ద్రువపత్రాల కొరకు వచ్చిన దరఖాస్తులను ప్రభుత్వ నిబంధనలను అనుసరించి త్వరగా జారీ చేసేందుకు తహసిల్దార్‌లు ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. పేరు, విస్తీర్ణం సవరణ సవరణ కొరకు వచ్చిన దరఖాస్తులను రికార్డుల ప్రకారంగా పరిశీలించి పరిష్కరించాలని తెలిపారు. పెండింగ్‌లో ఉన్న వాటిపై పూర్తిస్థాయి నివేదిక రూపోందించి అందజేయాలని తహసిల్దార్‌లను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News