Friday, April 26, 2024

మంత్రి మల్లారెడ్డిపై గుస్సా

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి తీసుకుంటున్న ఏకపక్ష నిర్ణయాలకు వ్యతిరేకంగా సోమవారం నాడిక్కడ మేడ్చల్ జిల్లా శాసనసభ్యులు సమావేశమయ్యారు. తమకు తెలియకుండా మంత్రి తీసుకుంటున్న నిర్ణయాల పై వారు ఈ సందర్భంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చే శారు. ప్రధానంగా మేడ్చల్ మార్కెటింగ్ కమిటీ చైర్మన్ నిమాయక విషయంలో మంత్రికి, జిల్లా శాసనసభ్యుల మధ్య వివాదం మొదలైంది. ఇప్పటి వరకు మార్కెటింగ్ కమిటీ చైర్మన్‌గా కొనసాగుకతున్న కుత్బుల్లాపూర్‌కు చెందిన రవి యాదవ్‌ను తప్పించి ఆ స్థానంలో మేడ్చల్ నియోజకవర్గానికి చెందిన భాస్కర్ యాదవ్‌ను నియమించారు. ఈ నిర్ణయమే ప్రస్తుతం మంత్రి, శాసనసభ్యుల మధ్య విభేదాలకు తీసింది.

ఇందుకు నిరసనగా మల్కాజ్‌గిరి నియోజకవర్గం శాసనసభ్యుడు మైనంపల్లి హనుమంతరావు నివాసంలో చెందిన శా సనసభ్యులు సమావేశమయ్యారు. ఈ పరిణామం అధికార పార్టీలో తీవ్ర కలవరానికి గురి చేసింది. ఈ సమావేశం అనంతరం శాసనసభ్యులు మీడియాతో మాట్లాడుతూ, పార్టీ ప్రతిష్టకు మచ్చతెచ్చే విధంగా తాము ఎప్పుడు ప్రవర్తించలేదని అన్నా రు. కేవలం తమ నియోజకవర్గాల్లో ఏం జరుగుతుందో సిఎం కెసిఆర్ తెలియజేయాలన్న ఉద్దేశ్యంతోనే సమావేశం ఏర్పాటు చేశామని మల్కాజ్‌గిరి నియోజకవర్గం శాసనసభ్యుడు మైనంపల్లి హ నుమంతరావు చెప్పారు. జిల్లాలో అనేక పదవులు కేవలం ఒకే నియోజకవర్గానికే దక్కుతున్నాయన్నారు. దీని ప్రధాన కారణంగా మంత్రి మల్లారెడ్డియేనని వ్యాఖ్యానించారు. ఫలితంగా పార్టీ కోసం ఎంతో కాలంగా పనిచేస్తున్న వారికి పదవులు లభించడం లేదన్నారు.

ఈ నేపథ్యంలో పదవుల కోసం పార్టీ శ్రేణుల నుంచి తమపై తీవ్రస్థాయిలో ఒత్తిళ్లు పెరుగుతున్నాయన్నారు. పైగా పదవులు అనుభవించిన వారికే మళ్లీ మళ్లీ పదవులు వస్తున్నాయన్నారు. పార్టీలో కష్టపడిన వారిని గుర్తించాల్సిన అవసరం ఉందన్నారు. క్యాడర్ గట్టిగా ఉ న్నంత కాలం పార్టీని ఎవరూ ఏమీ చేయలేరన్నా రు. పార్టీ కోసం పనిచేస్తున్న వారికి పదవులు రా వొద్దా ప్రశ్నించారు. పార్టీ క్యాడ ర్ గురించి మాట్లాడకపోతే తాము డమ్మీ శాసనసభ్యులమవుతామన్నారు. ప్రతి దానిని రాజకీయం చేయాల్సిన అవసరం లేదన్నారు.

కేవలం కార్యకర్తల కోసమే తాము సమావేశమైనట్టు మైనంపల్లి హన్మంతరావు స్పష్టం చేశారు. ఎవరో ఒకరు చెప్పకపోతే సమస్యలు పార్టీ అధిష్టానానికి ఎలా తెలుస్తాయని? మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఆయన చెప్పారు. అయినా జిల్లా శాసనసభ్యులంతా కలుసుకోవడం తప్పు కాదు కదా? అని ప్రశ్నించారు. ఎవరో చేసిన దానికి పార్టీ నష్టపోవద్దన్నదే తమ అభిమతమని హన్మంతరావు పేర్కొన్నారు. అలాగే తమ తమ నియోజకవర్గాల్లో నెలకొన్న సమస్యలను మంత్రి కెటిఆర్ దృష్టికి తీసుకు రావాలని ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నామని ఆయన వెల్లడించారు.

ఇలాంటి సమావేశాలు కేవలం బిఆర్‌ఎస్‌లోనే కాదు….అన్ని పార్టీల్లోనూ ఉంటాయన్నారు. పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తల గురించి తాము మాట్లాడుతున్నామే తప్ప…. తమ వారసుల గురించి మాట్లాడడం లేదని మైనంపల్లి హనుమంతరావు స్పష్టం చేశారు. శాసనసభ్యుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలని సిఎం కెసిఆర్ చెప్పిన మాటను కూడా కొందరు మంత్రులు పట్టించుకోవడం లేదన్నారు. ప్రజాస్వామ్యంలో మాట్లాడకపోతే ఎలా? అని అడిగారు. ఈ సమావేశం గురించి మీడియాకు తమ పార్టీకి చెందిన కొందరు నేతలు సమాచారం ఇచ్చారని ఈ సందర్భంగా మైనంపల్లి ఆరోపించారు. ఈ సమావేశంలో శాసనసభ్యులు కెపి.వివేకానంద, అరికెపూడి గాంధీ, భేతి సుభాష్‌రెడ్డి, మాధవరం కృష్ణారావు తదితరులు హాజరయ్యారు.

వారు ఎందుకు సమావేశమయ్యారో తెలుసుకుంటా

జిల్లా శాసనసభ్యులు ఎందుకు సమావేశమయ్యారనే అంశాన్ని జిల్లా మంత్రిగా తెలుసుకుంటానని మల్లారెడ్డి స్పష్టం చేశారు. తనకు ఎవరితోనూ విభేదాలు లేవన్నారు. అందరి సూచనలు, సలహాలు తీసుకునే జిల్లా పరంగా నిర్ణయాలు తీసుకుంటున్నట్లు ఆయన వెల్లడించారు. తాను ఒంటెద్దు పోకడలకు చాలా దూరమన్నారు. అందరిని కలుపుకునే ముందుకు సాగుతానని అన్నారు. వచ్చే ఎన్నికల్లోనూ జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో బిఆర్‌ఎస్ జెండా ఎగరాలన్నదే తన లక్షమన్నారు. అలాంటప్పుడు ఏ నాయకుడుగానీ, కార్యకర్తనుగానీ ఉద్దేశపూర్వకంగా తాను తక్కువ చేసి చూసే అవకాశమే లేదన్నారు. కొన్ని సందర్భాల్లో పార్టీ శ్రేణుల ఒత్తిడి మేరకు అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుందన్నారు. అది ఇతరులకు ఇబ్బంది కలుగడం సహజమేనని అన్నారు. ఏదేమైనప్పటికీ శాసనసభ్యుల సమావేశానికి సంబంధించిన పూర్తి సమాచారం వచ్చిన తరువాత మరోసారి మీడియా ముందుకు వచ్చి స్పందిస్తానని మంత్రి మల్లారెడ్డి అన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News