Monday, May 6, 2024

వ్యర్థాలను ఎక్కడ పడితే అక్కడ పారవేయెద్దు

- Advertisement -
- Advertisement -

తార్నాక : జంతు వ్యర్థాలను కవర్లో వేసి చెత్త సేకరణ కోసం వచ్చే మున్సిపల్ సిబ్బందికి అందజేయాలని డిప్యూటి మేయర్ మోతే శ్రీలతశోభన్‌రెడ్డి పేర్కోన్నారు.బక్రీద్ పండుగ పురస్కరించుకొని బుధవారం తార్నాక క్యాంపు కార్యలయంలో బిఆర్‌ఎస్ కార్మిక విబాగం అద్యక్షుడు మోతే శోభన్‌రెడ్డితో కలిసి ముస్లిం మైనారిటీలకు కవర్లను పంపిణి చేశారు.అనంతరం మాట్లాడుతూ బక్రీద్ పండుగను భక్తి శ్రద్ధ్దలతో జరుపుకోవాలని జంతువుల వ్యర్థ్దాలను కవర్లోనే వేయాలిన సూచించారు.

జంతు వ్యర్దాలైన,మరే ఇతర వ్యర్దాలైన కూడా డ్రైనేజీలలో,వీదులలో ఎక్కడ పడితే అక్కడ పార వేయవద్దని తెలిపారు.మనం పరిశుభ్రంగా ఉన్నట్లే మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో తార్నాక డివిజన్ చెందిన మైనారిటీ నాయకులు,బిఆర్‌ఎస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News