Tuesday, May 7, 2024

గాంధీ ఆస్పత్రిలో పెట్రోల్ డబ్బాతో వైద్యుడి హల్ చల్..

- Advertisement -
- Advertisement -

 

మనతెలంగాణ,హైదరాబాద్: కరోనా వైరస్‌ వ్యాప్తిపై తప్పుడు సమాచారం ఇచ్చినట్టు ఆరోపణలు ఎదుర్కొని వేటుకు గురైన డాక్టర్‌ వసంత్‌కుమార్‌ గాంధీ ఆసుపత్రికి పెట్రోల్ తో వచ్చి హల్ చల్ చేశాడు. విషయం తెలుసుకొని పోలీసులు అక్కడికి చోరుకొని డాక్టర్ ని అడ్డుకోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. గాంధీ ఆస్పత్రిలో వైద్యుడిగా పనిచేస్తున్న డాక్టర్ వసంత్ రెండు రోజుల క్రితం కరోనా పాజిటీవ్ కేసు నమోదయిందని మీడియాకు సమాచారం ఇచ్చాడు. దీనిపై విచారణ జరిపిన గాంధీ ఆస్పత్రి వైద్యులు ఎలాంటి కరోనా కేసు నమోదు కాలేదని, తప్పుడు సమాచారం ఇచ్చిన డాక్టర్ వసంత్‌పై చర్యలు తీసుకున్నారు. వెంటనే అతడిని డిపార్ట్‌మెంట్ ఆఫ్ హెల్త్‌కు సరెండర్ చేశారు. దీంతో మనస్థాపం చెందిన డాక్టర్ వసంత్ పెట్రోల్ డబ్బా తీసుకుని గాంధీ ఆస్పత్రికి వచ్చి ఆత్మహత్య చేసుకుంటానని హల్‌ చల్ చేశాడు. సమాచారం అందుకుని అక్కడికి చేరుకున్న చిలకలగూడ పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌ఓ బాలనాగి రెడ్డి అతడి సిబ్బంది వైద్యుడిని రక్షించారు. ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించిన వైద్యుడిని కాపాడిన పోలీసులను నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ అభినందించి, రూ.10,000 నగదు రివార్డు ప్రకటించారు.

Doctor Vasant Suicide Attempt in Gandhi Hospital

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News