Monday, April 29, 2024

వినియోగదారులకు స్విగ్గీ హెచ్చరిక

- Advertisement -
- Advertisement -

Swiggy

 

హైదరాబాద్ : సురక్షిత ఇంటర్నెట్ డే, 2020 సందర్భంగా ప్రముఖ ఫుడ్‌ డెలివరీ సంస్థ స్విగ్గీ తన వినియోగదారులకు కస్టమర్‌ కేర్‌ స్కాంలపై హెచ్చరికలు జారీ చేసింది. స్విగ్గీ ప్రతినిధులమని చెప్పి ఎవరైనా ఫోన్‌ చేస్తే అలాంటి వారి మాటలు నమ్మవద్దని, వారికి వినియోగదారులు తమ వ్యక్తిగత, బ్యాంకింగ్‌ సమాచారం ఇవ్వవద్దని స్విగ్గీ హెచ్చరించింది. స్విగ్గీ నుంచి ఎవరూ కస్టమర్లకు ఫోన్లు చేయరని, వారి బ్యాంక్‌ అకౌంట్‌ నంబర్లు, కార్డులు, పిన్‌ సమాచారం, ఓటీపీ వివరాలు ఎవరూ అడగరని, కనుక వినియోగదారులు ఈ సమాచారాన్ని ఎవరికీ చెప్పవద్దని స్విగ్గీ హెచ్చరించింది. ప్రస్తుతం కస్టమర్‌ కేర్‌ ప్రతినిధులమని చెప్పి మోసం చేసే స్కాంలు ఎక్కువగా జరుగుతున్నందున వినియోగదారులు ఈ విషయం పట్ల అప్రమత్తంగా ఉండాలని స్విగ్గీ హెచ్చరించింది.

Swiggy Warning on Customer Care Scams
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News