Friday, May 3, 2024

గేమింగ్ హౌస్‌పై పోలీసుల దాడి

- Advertisement -
- Advertisement -

 Gaming house

 

హైదరాబాద్ : పేకాట స్థావరంపై దాడి చేసి ఎనిమిది మందిని సెంట్రల్ జోన్ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.35,500 ప్లేకార్డులు, తొమ్మిది మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం….నగరంలోని దోమలగూడ, సాయివాణి ఆస్పత్రి వెనుక వైపునకు చెందిన అబ్దుల్‌లతీఫ్ ఖాన్ గేమింగ్ హౌస్ నిర్వహిస్తున్నాడు. ముషీరాబాద్‌కు చెందిన షేక్ పాషా, ఎండి జహీర్ హుస్సేన్, బాలనర్సింహులు, జబీర్ అలీ, ఎండి ఆసిఫ్, ఎడి అజీజ్, ఎండి మీరాజుద్దిన్ పేకాడుతున్నారు. న్యూనల్లకుంట, పద్మాకాలనీలో పేకాడుతున్నారనే సమాచారం రావడంతో పోలీసులు దాడి చేసి ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్నారు. పంటర్స్, స్సేహితుల ద్వారా అబ్ధుల్‌లతీఫ్ గేమింగ్ హౌస్ నిర్వహిస్తున్నాడు. గేమ్‌కు రూ.500 చొప్పున తీసుకుని పేకాడేందుకు తన ఇంటిని ఇస్తున్నాడు. టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడి చేసి రూ.35,500 స్వాధీనం చేసుకున్నారు. టాస్క్‌ఫోర్స్ డిసిపి రాధాకిషన్ రావు పర్యవేక్షణలో ఇన్స్‌స్పెక్టర్ అబ్దుల్ జావీద్, ఎస్సైలు శ్రీనివాసులు, శ్రీధర్, ఎండి షానవాజ్ తదితరులు పట్టుకున్నారు.

Police attack on Gaming house
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News