Monday, May 6, 2024

విమాన ప్రయాణికులకు షాక్.. ఛార్జీలు పెంపు

- Advertisement -
- Advertisement -

Domestic flight ticket price hike

న్యూఢిల్లీ: దేశీయవిమాన ప్రయాణాలు మరింత భారం కానున్నాయి. విమాన ప్రయాణ చార్జీలను 13 నుంచి 16 శాతం మేరకు పెంచుకునేందుకు వీలుకల్పిస్తూ కేంద్ర పౌరవిమానయాన మంత్రిత్వశాఖ నిర్ణయం తీసుకుంది. పెంచిన ధరలు జూన్ 1 నుంచి అమలుకాన్నాయని పౌరవిమానయాన శాఖ తెలిపింది. నలభై నిమిషాల పాటు ప్రయాణించే దూరానికి రూ.2,300 నుంచి రూ.2,600 పెంచగా, 40 నిమిషాల నుంచి 60 నిమిషాల వ్యవధిలో ప్రయాణ సమయం ఉండే ప్రయాణాలకు కనీస ఛార్జీని రూ.2,900 నుంచి రూ.3,300వరకు పెంచారు. కనీస ఛార్జీని దూరాన్ని బట్టి 2600 నుంచి 8700గా ఖరారు చేస్తూ డిజిసిఎ ఉత్తర్వులు జారీచేసింది. దేశంలోని అన్ని మార్గాలను 7 సెక్టార్లగా విభజించి ఛార్జీలు ఖరారు చేసినట్టు డిజిసిఎ వెల్లడించింది. గతేడాది మేలో విడుదల చేసిన ఉత్తర్వులను డిజిసిఎ సవరణ చేసింది.

Domestic flight ticket price hike

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News