Saturday, April 27, 2024

మాహిష్మతి రాజ్యంలో ట్రంప్.. ఫన్నీ వీడియో వైరల్

- Advertisement -
- Advertisement -

 

అగ్రదేశం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అమరేంద్ర బాహుబలిగా అవతారమెత్తి శత్రువులను చీల్చిచెండాతున్నాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ నెల 24న తన భార్య, కూతురు, అల్లుడితో కలిసి ట్రంప్ భారత్ పర్యటనకు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ పర్యటనపై అటు అమెరికా, ఇటు ఇండియా అభిమానుల్లో ఎంతో ఆసక్తి నెలకొంది. ఇందులో భాగంగా రెబల్ స్టార్ ప్రభాస్, దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్ లో రూపొంది ఇండియా భాక్సాఫీసును షేక్ చేసి సంచలన విజయం సాధించిన ‘బాహుబలి’లో ట్రంప్ మాహిష్మతి రాజ్యాన్ని ఏలుతున్నాడు. అదేంటనుకుంటున్నారా?, అవును.. ఓ అభిమాని రూపొందించిన వీడియోలో ట్రంప్ బాహుబలిగా మారిపోయి శత్రువులపై విరుచుకుపడుతున్నాడు. ఓ ఇండియన్ అభిమాని ట్రంప్, ఆయన భార్య మెలానియా, మోడీ ఫొటోలతో బాహుబలి వీడియోను రూపొందించాడు. ఇందులో ప్రభాస్ ప్లేస్ లో ట్రంప్, శివగామి ప్లేస్ లో మెలానియా ఫోటోలను సెట్ చేసిన వీడియోను ట్విట్టర్‌లో షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ ఫన్నీ వీడియో సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది. ఈ వీడియోని చూసిన ట్రంప్ రీ ట్వీట్ చేస్తూ.. ఇండియా ఫ్రెండ్స్‌ని కలిసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని పేర్కొన్నాడు.

Donald Trump Likes Bahubali Video of Him

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News