Friday, April 26, 2024

మధ్యవర్తిగా నేను రెడీ

- Advertisement -
- Advertisement -

Donald-Trump

వాషింగ్టన్ : భారత్ చైనా మధ్య తాను మధ్యవర్తిగా ఉండేందుకు సిద్ధంగా ఉన్నట్లు అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. రెండు దేశాల మధ్య సరిహద్దు వివాదం రాజుకున్న దశలో ట్రంప్ స్వచ్ఛందంగా బుధవారం ముందుకు వచ్చారు. మధ్యవర్తిత్వం లేదా చర్చించేందుకు సిద్ధం, ఇందుకు ఇష్టపడుతున్నాను, చక్కదిద్దగలను అని ట్రంప్ తెలిపారు. ఇరు దేశాల మధ్య సామరస్యం నెలకొనాలనేదే అమెరికా ఆలోచన అని, ఇందుకు సరైన చర్చలకు తాను సిద్ధంగా ఉన్నానని, ఈ విషయాన్ని ఇరు పక్షాలకు తెలియచేశానని ట్రంప్ వివరించారు. రాజుకున్న వివాదాన్ని చల్లార్చేందుకు తాను అన్ని విధాలుగా సమర్థుడినని కూడా తెల్లవారుజామున వెలువరించిన ట్వీట్‌లో తెలిపారు. ఇరు పక్షాలకు థ్యాంక్స్ చెప్పారు. భారత్ చైనా మధ్య దాదాపుగా 3500కిలోమీటర్ల పొడవైన ఎల్‌ఎసి అనధికారిక సరిహద్దుగా కొనసాగుతోంది.

Donald Trump offers to India China

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News