Monday, May 6, 2024

పర్యాటకులను ఆకర్షించేలా కొత్త మార్గాల్లో డబుల్ డెక్కర్ బస్సులు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: డబుల్ డెక్కర్ బస్సులతో పలు పర్యాటక ప్రాంతాలను దర్శించుకునేలా హెచ్‌ఎండిఏ అధికారులు ప్రత్యేక మార్గాన్ని సిద్ధం చేశారు. ట్యాంక్‌బండ్, బిర్లామందిర్, అసెంబ్లీ, సాలార్‌జంగ్ మ్యూజియం, చార్మినార్, మక్కా మసీదు, తారామతి బారాదరి, గోల్కొండ, గండిపేట పార్క్, దుర్గం చెరువు, తీగల వంతెన, ఐటీ కారిడార్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్‌లో వీటిని తి ప్పాలని అధికారులు నిర్ణయించారు. ఈ బస్సులు ఉదయం వేళల్లో ట్యాంక్‌బండ్ నుంచి బయలుదేరి ఆయా రూట్లలో తిరిగి రాత్రి ట్యాంక్‌బండ్‌కు చేరుకుంటాయి.

ఈ బస్సుల కోసం ఖైరతాబాద్ ఎస్టీపీ, సంజీవయ్య పార్క్ వద్ద చార్జింగ్ కోసం ప్రత్యేక పాయింట్లు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఈ బస్సుల్లో ప్రయాణం ఉచితం. కొద్దిరోజుల తర్వాత మినిమం ఛార్జీ వసూలు చేయాలని హెచ్‌ఎండిఏ అధికారులు భావిస్తున్నారు. ఒక్కో ట్రిప్పుకు ఒక్కొక్కరి నుంచి రూ.50 వసూలు చేసే అవకాశం ఉన్నట్లుగా తెలిసింది. అయితే టికెట్ ఎప్పటిలోగా అందుబాటులోకి వస్తుందన్న విషయం ఇంకా ఖరారు కాలేదు.

6 డబుల్ డెక్కర్ బస్సులు
పర్యాటకుల స్పందన మేరకు మరికొ న్ని మార్గాలను ఎంపిక చేసే అవకాశం ఉందని హెచ్‌ఎండిఏ తెలిపింది. రూ. 12 కోట్లతో హెచ్‌ఎండిఏ నగరంలో మొత్తం 6 ఎలక్ట్రిక్ డబుల్ డెక్క ర్ బస్సులను ప్రారంభించింది. ఈ డబుల్ డెక్కర్ బస్సులు రెండు నెలల నుంచి నెక్లెస్‌రోడ్డు, ఎన్టీఆర్ మార్గ్‌లో వీటిని తిప్పుతున్నారు. ఈ బస్సులు మ ధ్యాహ్నం 3:30 నుంచి రాత్రి 9:30 వరకు నడుస్తున్నాయి. ‘జాయ్ రైడ్’ పేరుతో ఈ బస్సులను ఉచితంగా తిప్పుతున్నారు. అయితే ఆశించిన స్థాయిలో బస్సులు ఎక్కేందుకు ప్రయాణికులు ఆసక్తి చూపకపోవడంతో ప్రస్తుతం పర్యాటకులను ఆకర్శించేలా పలు కొత్త మార్గాలను హెచ్‌ఎండిఏ అం దుబాటులోకి తీసుకొచ్చింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News