Thursday, May 9, 2024

ఐపిఎల్ టైటిల్ స్పాన్సర్‌గా డ్రీమ్ 11

- Advertisement -
- Advertisement -

ముంబై: ఐపిఎల్ టైటిల్ స్పాన్సర్ ఎవరూ అనే ఉత్కంఠతకు తెరపడింది. ఐపిఎల్ 13వ సీజన్‌కు సంబంధించి టైటిల్ స్పాన్సర్‌షిప్ హక్కులను డ్రీమ్ 11 కంపెనీ దక్కించుకున్నట్టు జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. అయితే దీనిపై భారత క్రికెట్ బోర్డు అధికారికంగా ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు. ఐపిఎల్ ప్రధాన స్పాన్సర్‌గా ఉన్న చైనాకు చెందిన మొబైల్ ఫోన్ల తయారీ సంస్థ వివో ఈసారి టైటిల్ స్పాన్సర్‌గా ఉండకూడదని నిర్ణయించింది. దీంతో కొత్త స్పాన్సర్ కోసం భారత క్రికెట్ బోర్డు దరఖాస్తులను ఆహ్వానించింది. ఇక స్పాన్సర్‌షిప్ కోసం టాటా సన్స్, బైజూస్, పతాంజలి వంటి పెద్ద పెద్ద కంపెనీలు పోటీ పడ్డాయి. చివరికి అత్యధిక బిడ్‌ను కోడ్ చేసిన డ్రీమ్ 11 కంపెనీ ఐపిఎల్ టైటిల్ స్పాన్సర్‌షిప్‌ను దక్కించుకుంది. స్పాన్సర్‌షిప్ కోసం డ్రీమ్ 11 కంపెనీ రూ.250 కోట్ల రూపాయలను చెల్లించేందుకు ముందుకు వచ్చింది. బిడ్‌లో ఇదే అత్యధిక ధర కావడంతో బిసిసిఐ కూడా డ్రీమ్ 11కు ఐపిఎల్ స్పాన్సర్‌గా నియమించేందుకు అంగీకరించింది. అయితే దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది.

Dream11 win IPL title sponsorship rights

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News