Home ఆంధ్రప్రదేశ్ వార్తలు లారీ డ్రైవర్, క్లీనర్ సజీవ దహనం

లారీ డ్రైవర్, క్లీనర్ సజీవ దహనం

Driver And Cleaner Burnt Alive At Kadapa District

అమరావతి: కడప జిల్లా దువ్వూరు వద్ద ఆదివారం మధ్యాహ్నం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జాతీయ రహదారిపై వేగంగా వచ్చిన వచ్చిన లారీ అదుపుతప్పి డివైడర్ ను ఢీకొట్టింది. దీంతో లారీలో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో లారీ పూర్తిగా దగ్ధమైంది. లారీ క్యాబిన్ లో చిక్కుకున్న డైవర్, క్లీనర్ సజీవ దహనమయ్యారు. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ నుంచి కడప జిల్లా దువ్యూరుకు లారీ వెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగినట్టు పోలీసులు తెలిపారు. స్థానికులు సమాచారంతో  ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Driver And Cleaner Burnt Alive At Kadapa District