Home ఖమ్మం డ్రైనేజీలో పడి మందుబాబు మృతి

డ్రైనేజీలో పడి మందుబాబు మృతి

ఖమ్మం: మందుబాబు మూత్ర విసర్జన కోసం బయటకెళ్లి డ్రైనేజీలో పడి మృతి చెందిన సంఘటన ఖమ్మ జిల్లా ఖానాపురంలోని యుపిహెచ్ కాలనీలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. మోటాపూరం గ్రామానికి చెందిన మల్లెపల్లి రవి (40) మద్యం ఫుల్‌గా తాగాడు. మూత్రం వస్తుందని బయటకు వెళ్లి డ్రైనేజీలో పడ్డాడు. తలకు బలమైన గాయాలు కావడంతో మృతి చెంది ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.