Friday, May 10, 2024

దుబ్బాక ఉప ఎన్నిక పోలింగ్ ప్రారంభం…

- Advertisement -
- Advertisement -

సిద్ధిపేట: దుబ్బాక ఉప ఎన్నిక పోలింగ్‌ ప్రారంభమైంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్‌ జరగనుంది. సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు కరోనా‌ బాధితుల కోసం ప్రత్యే సమయం కేటాయించారు. దుబ్బాక ఉప ఎన్నికలో 23 మంది బరిలో ఉండగా ప్రధాని పోటీ టిఆర్ఎస్, బిజెపి, కాంగ్రెస్ మధ్య ఉంది. దుబ్బాకలోని 7 మండలాల్లోని ఓటర్లవివరాలు పరిశీలిస్తే దుబ్బాక మండలంలో 55వేల 208, మిరుదొడ్డిలో 31వేల 742, తొగుటలో 26 వేల 751, దౌలతాబాద్‌లో 23 వేల 32, రాయపోల్‌లో 20వేల 513, చేగుంటలో 32వేల 829, నార్సింగ్‌లో 8వేల 215 మంది ఓటర్లు ఉన్నారు. ఇప్పటివరకు పోస్టల్ బ్యాలెట్‌కోసం నమోదు చేసుకోని వారుకూడా ఉన్నట్లు పరిశీలకులు భావిస్తున్నారు. 148 గ్రామాల్లో 315 పోలింగ్ బూత్ లను ఎన్నికల అధికారులు ఏర్పాటు చేశారు. దుబ్బాకలో మొత్తం ఓటర్ల సంఖ్య 1,98, 807కాగా పురుష ఓటర్లు 98 వేలు, మహిళ ఓటర్లు 1,00,719 మంది ఉన్నట్టు ఎలక్షన్ కమిషన్ వెల్లడించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News