Tuesday, April 30, 2024

బాలయ్య సినిమాలో మరో నందమూరి హీరో..

- Advertisement -
- Advertisement -

Taraka Ratna key role in Balakrishna-Boyapati Film?

మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా ఓ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో మరో నందమూరి హీరో తారకరత్న ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడని తెలిసింది. ఈ సినిమాలో తారకరత్న క్యారెక్టర్ ఒక యంగ్ ఎమ్మెల్యే క్యారెక్టర్ అని సమాచారం. అతనిది కాస్త నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ అని కూడా తెలిసింది. కాగా ఈ సినిమాతో ఓ కొత్త హీరోయిన్‌ను పరిచయం చేయబోతున్నారు. ఈ చిత్రాన్ని మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించనుండగా తమన్ సంగీతం సమకూరుస్తున్నాడు. ఇక బాలయ్యకు ‘సింహ’ రూపంలో పెద్ద హిట్ ఇచ్చిన బోయపాటి ఆ తర్వాత దాన్ని మించి ‘లెజెండ్’ విజయాన్ని అందించాడు. కాబట్టి ఈసారి ‘లెజెండ్’ను మించిన హిట్ పడాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. ఇక బాలయ్య వరుస సినిమాలతో ఫుల్ బిజీ అవుతున్నారు.

Taraka Ratna key role in Balakrishna-Boyapati Film?

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News