Saturday, May 4, 2024

పంజాబ్‌లో 31 దాకా విద్యాసంస్థలు బంద్

- Advertisement -
- Advertisement -

Educational institutions closed in Punjab till March 31

న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో పంజాబ్ రాష్ట్రప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. కరోనా మహమ్మారి కట్టడికి ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా పలు ఆంక్షలను అమలు చేస్తున్న ప్రభుత్వం వాటిని మరింత కఠినతరం చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా మార్చి 31 వరకు విద్యాసంస్థలన్నీ మూసివేయాలని నిర్ణయించినట్లు తెలిపింది. అలాగే సినిమా థియేటర్లు, షాపింగ్ మాల్స్‌పైనా ఆంక్షలు విధించారు. థియేటర్లు 50 శాతం సామర్థంతో పని చేయాలని ఆదేశించారు. వైరస్ గొలుసును తెంచేందుకు ప్రజలంతా రెండు వారాల పాటు సామాజిక కార్యక్రమాలకు దూరంగా ఉండాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కెప్టెన్ అమరిందర్ సింగ్ విజ్ఞప్తి చేశారు.

కుటుంబ సభ్యులు, బంధువులతో పరిమిత సంఖ్యలో ఇళ్లలోనే కార్యక్రమాలను జాగ్రత్తగా నిర్వహించుకోవాలని సూచించారు. ఈ నిబంధనలన్నీ శనివారంనుంచే అమలులోకి వస్తామని తెలిపారు. ఇదిలా ఉండగా, కరోనా వైరస్ ప్రభావం అధికంగా ఉన్న 11 జిల్లాల్లో ఆదివారంనుంచి సామాజిక కార్యక్రమాలను పూర్తిగా నిషేధించినట్లు సిఎం తెలిపారు.అంత్యక్రియలు, వివాహాలకు మినహాయింపు ఇచ్చినప్పటికీ 20 మందికి మించి హాజరు కావద్దని సూచించారు. ఆయా జిల్లాల్లో రాత్రి10నుంచి ఉదయం 5 గంటలవరకు రాత్రిపూట కర్ఫూను అమలు చేస్తున్నట్లు తెలిపారు. అలాగే సినిమా థియేటర్లు, మల్టీప్లెక్స్‌లు, మాల్స్ అన్నీ ఆదివారం పూర్తిగా మూసివేయాలని ఆదేశించారు. పరిశ్రమలు, అత్యవసర సేవలు మాత్రం యథాతథంగా కొనసాగుతాయని ముఖ్యమంత్రి స్పష్టంచేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News