Sunday, May 5, 2024

చత్తీస్‌గఢ్‌లో ఎనిమిది మంది నక్సల్స్ లొంగుబాటు

- Advertisement -
- Advertisement -

Eight Naxals surrender in Chhattisgarh

 

దంతేవాడ : చత్తీస్‌గఢ్ లోని దంతేవాడలో ఎనిమిది మంది నక్సల్స్ సోమవారం పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఈ ఎనిమది మందిలో మహిళానక్సలైట్ ఒకరు ఉన్నారు. మావోయిస్టు మిధ్యా సిద్ధాంతానికి అసంతృప్తి చెంది, లాన్ వర్రట్టు (స్వగ్రామానికి తిరిగి ) అన్న ఉద్యమానికి ప్రభావితమై వారు ఆయుధాలు విడిచిపెట్టి లొంగిపోయినట్టు దంతేవాడ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అభిషేక్ పల్లవ చెప్పారు. ఈ ఎనిమిది మందిలో సురేష్ ఒయామి (20) ప్లాటూన్ సభ్యునిగా చురుకుగా వ్యవహరించే వాడు. ఈతనిపై రూ.2 లక్షల అవార్డు ఉంది. మిగతా వారిపై రూ. లక్ష వంతున అవార్డు ఉంది. వీరితో ఇప్పటివరకు ఈ జిల్లాలో మొత్తం 248 నక్సల్స్ లొంగిపోయారు. ఇప్పుడు లొంగిపోయిన వారికి రూ.10,000 వంతున తక్షణ సహాయం అందిస్తున్నట్టు ప్రభుత్వ పునరావాస విధానం కింద మరింత ఆర్థిక సహాయం అందనున్నట్టు ఎస్‌పి చెప్పారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News