Monday, May 6, 2024

గణేష్ మండపాల వద్ద విద్యుత్ భద్రతా చర్యలు పాటించాలి

- Advertisement -
- Advertisement -

విద్యుత్ శాఖ సీఎండి రఘుమారెడ్డి

 Electrical protection in Ganesh mandapam

మన తెలంగాణ సిటీబ్యూరో: వినాయక చవితి పండుగ సందర్భంగా ఏర్పాటు చేసిన గణేష్ మండపాలకు నిరంతర విద్యుత్ సరఫరా , విద్యుత్ భద్రతా ఏర్పాట్లపై టిఎస్‌ఎస్‌పిడిసీఎల్ సీఎండి జి. రఘుమారెడ్డి మింట్ కంపౌండ్‌లోని విద్యుత్‌శాఖ ప్రధాన కార్యాలయంలో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. సెప్టెంబర్ 10 నుంచి ప్రారంభమయ్యే గణేష్ పండుగ ఉత్సవాలు 11 రోజుల పాటు నిర్వహిస్తారు. మండపాలకు నిరంతరాయ విద్యుత్ సరఫరా , భద్రతా కోసం విద్యుత్ శాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు చేసిందన్నారు. సామాన్య భక్తులు, మండ నిర్వహకులు మండలపాల వద్ద విద్యుత్ భద్రతా చర్యలు పాటించాలని విజ్ఞప్తి చేశారు. విద్యుత్ భద్రతా చర్యలు పాటిస్తూ ప్రజలు వినాయక చవితి పండగను జరుపుకోలన్నారు. అదే విధంగా వినియోగదారులకు, విద్యుత్ సిబ్బందికి ఆయన వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు.

భక్తులు, మండపాల నిర్వహకులు పాటించాల్సిన విద్యుత్ భద్రతా చర్యలు ఇవే…

* మండపాలకు విద్యుత్ సరఫరా కోసం సామాన్యులు స్తంబాలు ఎక్కవద్దు. సంస్థ సిబ్బంది ద్వారానే కనెక్షన్ పొందాలి.
* ఐఎస్‌ఐ మార్కు కలిగిన ప్రామాణిక విద్యుత్ వైర్లను మాత్రమే వినియోగించాలి. ఎటువంటి జాయింట్ వైర్లను వినియోగించవద్దు.
* మండపాల్లో తగినంత సామర్థం కలిగిన ఎంబిసి తప్పకుండా వాడాలి. దీన్ని వినియోగించడం ద్వారా విద్యుత్ ప్రమాదాల వద్ద నుంచి రక్షణ పొందవచ్చు.
* మండపాల్లో విద్యుత్ సంబధించి పనులు చేసేటప్పుడు పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలిచాలి.
* విద్యుత్ వైర్లు, పోల్స్, ఇతర ప్రమాదకర విద్యుత్ పరికరాలకు పిల్లల్ని దూరంగా ఉంచాలి.
* ఒక వేళ ఎవరికైనా విద్యుత్‌షాక్ తగిలితే వారికి వెంటనే వైద్యసాయం అందించాలి. అంతే కాకుండా ప్రమాదానికి సంబంధించిన సమాచారాన్ని వెంటనే సిబ్బందికి తెలియ చేయాలి.
* విద్యుత్ లైన్లు ఎక్కడైన తెగిపడ్డా, ఇతర అత్యవసర పరిస్థితులు ఏర్పడినప్పుడు వెంటనే 1912 లేదా డయల్ 100, సమీప ప్యూజ్ ఆఫ్ కాల్ స్బిందికి వెంటనే సమాచారం అందించాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News