Monday, April 29, 2024

ప్రముఖ విద్యావేత్త రామకృష్ణా రావు ఇకలేరు!

- Advertisement -
- Advertisement -

Koneru Ramakrishna Rao
విశాఖపట్నం: ప్రముఖ విద్యావేత్త, మనస్తత్వశాస్త్రవేత్త ప్రొఫెసర్ కోనేరు రామకృష్ణా రావు (89) వయస్సు పైబడిన వ్యాధులతో మంగళవారం కన్నుమూశారని ఆయన కుటుంబ వర్గాలు తెలిపాయి. ఆయన 2011లో పద్మశ్రీ అందుకున్నారు. ఆంధ్రయూనివర్శిటీకి ఆయన వైస్‌ఛాన్సలర్‌గా, గీతం డీమ్డ్ యూనివర్శిటీకి ఛాన్సలర్‌గా పనిచేశారు. ఆయన 20కిపైగా పుస్తకాలు రాశారు. వందలాది రీసెర్స్ పేపర్లు కూడా రాశారు. ఆయన సైకాలజిస్ట్‌గా అంతర్జాతీయ ఖ్యాతినొందారు. అమెరికాలోని పారాసైకాలజికల్ సంఘానికి అధ్యక్షుడిగా, ఇండియన్ అకాడమి ఆఫ్ అప్లయిడ్ సైకాలజీ అధ్యక్షుడిగా పనిచేశారు. ఆయన గాంధేయవాదం అధ్యయనంలో కూడా మేధావి. ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యామండలి మాజీ చైర్మన్ కూడా. అంతేకాక ఆయన యూనివర్శిటీ పాఠ్యప్రణాళికలో అనేక కీలక సంస్కరణలు కూడా తెచ్చారు. ఆయనకు అనేక విశ్వవిద్యాలయాలు గౌరవ డాక్టరేట్‌ను ఇచ్చి సన్మానించాయి. ఆయనకు ఒక కుమారుడు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News