Friday, April 26, 2024

ప్రతి మంగళవారం ఉద్యోగుల సమస్యలు పరిష్కారం

- Advertisement -
- Advertisement -

Employee problems

 

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రవాణా సంస్థలో ఉద్యోగుల భద్రతకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ స్పష్టం చేశారు. ఈ మేరకు బుధవారం టిఎస్‌ఆర్‌టిసి ఉన్నతాధికారుల సమావేశంలో మాట్లాడుతూ సంస్థ పరిధిలో విధులు నిర్వహించే ఉద్యోగుల భద్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని అదేశించారు. ఈ మేరకు ప్రతి మంగళవారం ఉద్యోగుల సమస్యలను పరిష్కరించే దినంగా నిర్వహించాలని అధికారులను అదేశించారు. అలాగే ఉద్యోగుల విన్నపాలను సానూకూలంగా పరిష్కరించాలని మంత్రి ఉన్నతాధికారులను అదేశించారు. సిఎంకెసిఆర్ నిర్దేశాల మేరకు టిఎస్‌ఆర్‌టిసి ఉద్యోగుల సమస్యల పరిష్కారం పై ప్రత్యేక దృష్టి సారించాలని అదేశించారు.

ఈ సందర్భంగా ఉద్యోగుల భద్రత, సమస్యల పరిష్కారాం కోసం అమలు చేస్తున్న అంశాల పై ఆయన సమీక్షించారు. టిఎస్‌ఆర్‌టిసి సంస్థను బలోపేతం చేయడంతో పాటు ఉద్యోగుల సంక్షేమం పై కృషి చేయలన్నారు. ఈ మేరకు ఉద్యోగుల భద్రతకు సంబంధించిన విధి విధానాలను వారం రోజుల్లో తయారు చేసి అందజేస్తామని ఎగ్జిక్యూటీ డైరెక్టర్‌లు మంత్రికి వివరించారు. ఈ మేరకు ఉద్యోగులకు సంబంధించిన ఒవర్ డివ్యూటి, మెడికల్ గ్రౌండ్ పై వచ్చే వినతులను మానవతాధృక్పథంతో పరిష్కరించాలని సూచించారు. బస్సుల్లో బాధ్యతగా టికెటు తీసుకునే విధంగా ప్రయాణికులకు విస్తృతమైన అవగాహన కల్పించాలని సూచించారు. అలాగే ఓఆర్‌ను పెంచాలని అదేశించారు. ఈ సమీక్షా సమావేశంలో ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్‌లు పురుషోత్తం, వినోద్ కుమార్, వెంకటేశ్వర్‌రావు, యాదగిరి, ఆర్థిక సలహాదారు రమేశ్, సిపిఎం. సూర్యకిరణ్, ఎస్‌ఎల్‌ఓ శ్రీలత, ,ఎస్‌పిఆర్‌ఎం జిఆర్.కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

ఆర్‌టిసి బస్సుల్లో ప్రయాణికులకు ఆదరణ
టిఆఎస్‌ఆర్‌టిసి మేనేజింగ్ డైరెక్ట్ సునీల్ శర్మ
మనతెలంగాణ/హైదరాబాద్: ఆర్‌టిసి బస్సుల్లో ప్రయాణికులకు విశేషమైన ఆదరణ అందించే విధంగా పలు నూతన కార్యక్రమాలను ప్రవేశపెట్టుతామని టిఎస్‌ఆర్‌టిసి మేనేజింగ్ డైరెక్టర్ సునీల్ శర్మ వెల్లడించారు. బుధవారం మంత్రి అధ్యక్షతన జరిగిన సమావేశంలో టిఎస్‌ఆర్‌టిసి పరిధిలో ప్రయాణికులకు విస్తృతమైన సేవలు అందించే కార్యచరణ ప్రణాళిక విధానాలను వివరించారు. ఈ మేరకు బస్సు స్టాండుల్లో కూడళ్లలో ప్రత్యేకంగా బస్సుల రాక పొకలకు సంబంధించిన సమాచారం అందించడంతో పాటు స్టేజీల వివరాలు తెలియజేసే విషయాల పై తగు కార్యచరణ విధానాలను అమలులోకి తెస్తామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రయాణికులతో స్నేహపూర్వకంగా వ్యవహరించడం, బస్సు ఎక్కే ప్రయాణికులను మర్యాదపూర్వకంగా ఆహ్వానం పలకడం, ప్రత్యేక రోజుల్లో ప్రయాణికులను విధిగా విష్ చేయడం లాంటి అంశాలపై సిబ్బందికి అవగాహన కల్పిస్తామని మంత్రికి దృష్టికి తెచ్చారు.

Employee problems are resolved every Tuesday
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News