Saturday, April 27, 2024

ఇపిఎఫ్‌ఓ ఖాతాదారులకు అలర్ట్

- Advertisement -
- Advertisement -

EPFO-Aadhaar linking alerts

న్యూఢిల్లీ : ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ చందాదారులు సెప్టెంబర్ 1 లోపు తమ ఆధార్ కార్డును పిఎఫ్ ఖాతాలతో లింక్ చేసుకోవాలని ఇపిఎఫ్‌ఓ సంస్థ సూచించింది. ఇపిఎఫ్‌ఓ ఉద్యోగులకు పిఎఫ్ ఖాతాలకు ఆధార్ లింక్ గడువును 2021 జూన్ 1 నుంచి 2021 సెప్టెంబర్ 1 వరకు పెంచిన విషయం తెలిసిందే. వచ్చే నెల నుంచి ఉద్యోగులు ఇపిఎఫ్ ఖాతాను ఆధార్ కార్డుతో అనుసంధానం చేయకపోతే ఉద్యోగుల ఖాతాలో పిఎఫ్ డబ్బులు పడవని ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ ఒక ప్రకటనలో పేర్కొంది. అందుకోసం కార్మిక మంత్రిత్వశాఖ సామాజిక భద్రత-2020 చట్టంలో సెక్షన్-142 ను సవరించింది. సెక్షన్-142 కింద ఉద్యోగులు ఇతర ప్రయోజనాలు, సేవలను పొందడం కోసం ఆధార్ నంబర్‌ను లింక్ చేయడం తప్పనిసరి కానుంది. ‘యూఏఎన్ తో ఆధార్‌ని లింక్ చేయకపోతే సెప్టెంబర్ 1 నుంచి, ఎంప్లాయర్ పీఎఫ్ అమౌంట్‌ను చెల్లించలేరని డెలాయిట్ ఇండియా భాగస్వామి సరస్వతి కస్తూరి రంగన్ పేర్కొన్నారు.

ఈపీఎఫ్‌ను ఆధార్‌తో లింకు చేయండి ఇలా?

అధికారిక ఇపిఎఫ్‌ఓ వెబ్‌సైట్( www.epfindia.gov.in) ఓపెన్ చేసి లాగిన్ అవ్వండి.
ఇప్పుడు ఆన్‌లైన్ సర్వీసెస్ పై క్లిక్ చేసి ఈ-కెవైసి పోర్టల్‌కు వెళ్లి యుఎఎన్ ఆధార్ లింక్ పై క్లిక్ చేయండి
యుఎఎన్ ఖాతాలో నమోదు చేసిన మీ యుఎఎన్ నంబర్, మొబైల్ నంబర్‌ను నమోదు చేయండి.
మీ మొబైల్ నంబర్‌కు ఓటీపీ నంబర్‌ను పొందుతారు. ఓటీపీని, 12 అంకెల ఆధార్ సంఖ్యను ఎంటర్ చేసి ఫారమ్‌ను సమర్పించండి. ఇప్పడు ఓటీపీ ధృవీకరణ ఎంపికపై క్లిక్ చేయండి.
మీ ఆధార్ వివరాలను ధృవీకరించడానికి మీ ఆధార్‌కు లింక్ చేసిన మొబైల్ నంబర్, మెయిల్‌లో ఓటీపీ వస్తుంది. ఈ ధృవీకరణ తర్వాత మీ ఆధార్ మీ పీఎఫ్ ఖాతాకు లింక్ చేయబడుతుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News