Friday, May 3, 2024

ఓటును దుర్వినియోగం చేయవద్దు

- Advertisement -
- Advertisement -

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఓటింగ్ శాతం పెంచేందుకు వివిధ స్వచ్చంధ సంస్థలు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాయి. కళాశాలల్లో ఓటరు నమోదుపై విస్తృత ప్రచారం చేశారు. ప్రజాస్వామ్య ప్రక్రియలో కీలకమైన ఓటు వేసి నచ్చిన నాయకుడిని ఎన్నికోవాలని కోరుతున్నారు. ఐదేళ్లకోసారి వచ్చే ఎన్నికల ప్రక్రియలో మనం ఎంచుకునే ప్రభుత్వంపైనే మన భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని చెబుతున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల నేపథ్యంలో ప్రతి ఒక్కరూ తమ విలువైన ఓటును వినియోగించుకోవాలని పలువురు ప్రముఖులు అభిప్రాయపడుతున్నారు. ప్రజాస్వామ్యంలో నచ్చిన నాయకుడిని ఎన్నుకునే హక్కును ఓటు కల్పిస్తుందని అలాంటి ఓటును దుర్వినియోగం చేయవద్దని వారు కోరుతున్నారు. ముఖ్యంగా పోటీలో ఉన్న ఏ ఒక్కరు నచ్చకపోతే కనీసం నోటాకైనా వేయాలని చెబుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News