Saturday, April 27, 2024

ఐపిఎల్‌కు సర్వం సిద్ధం!

- Advertisement -
- Advertisement -

Everything is ready for the IPL2022!

కనువిందు చేయనున్న పొట్టి క్రికెట్

ముంబై: ప్రపంచ క్రికెట్‌లోనే అత్యంత జనాదారణ కలిగిన టోర్నీగా పేరు తెచ్చుకున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) టి20 టోర్నమెంట్‌కు సర్వం సిద్ధమైంది. ఈసారి పది జట్లతో ఐపిఎల్ సమరం జరుగనుంది. ఇప్పటి వరకు ఉన్న 8 జట్లకు తోడుగా మరో రెండు కొత్త ఫ్రాంచైజీలు ఈసారి బరిలోకి దిగనున్నాయి. శనివారం ఈ మెగా టోర్నీకి తెరలేవనుంది. ఇక మే 22న లీగ్ మ్యాచ్‌లకు తెరపడుతోంది. ఈసారి రెండు నగరాల్లోనే ఐపిఎల్ సమరం జరుగనుంది. ముంబైలోని మూడు స్టేడియాలతో పాటు పుణె అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం ఐపిఎల్‌కు ఆతిథ్యం ఇవ్వనుంది. ముంబైలోని వాంఖడే, డివై పాటిల్, బ్రాబోర్న్ స్టేడియాలు ఐపిఎల్ మ్యాచ్‌లకు వేదికలుగా నిలువనున్నాయి. శనివారం చెన్నై సూపర్ కింగ్స్‌కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్ల మధ్య వాంఖడే స్టేడియంలో తొలి మ్యాచ్ జరుగనుంది. ఈసారి పది జట్లు బరిలోకి దిగుతున్నాయి. ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరులతో పాటు ఈసారి కొత్తగా లక్నో సూపర్ జెయింట్స్, గుజరాత్ టైటాన్స్ టీమ్‌లు పోటీ పడుతున్నాయి.

కాగా, కరోనా భయం పూర్తిగా తగ్గక పోవడంతో ఈసారి పరిమిత సంఖ్యలోనే అభిమానులకు మ్యాచ్‌లను చూసేందుకు అనుమతి ఇస్తున్నారు. దీంతో మైదానాల్లో ఐపిఎల్ మ్యాచ్‌లను తిలకించాలనే భావించిన క్రికెట్ ప్రేమీకులకు నిరాశే మిగిలింది. ఇక ఈసారి బరిలోకి దిగుతున్న పది జట్లలోనూ అగ్రశ్రేణి క్రికెటర్లు ఉన్నారు. దీంతో ఐపిఎల్ సమరం రసవత్తరంగా సాగడం ఖాయం. డేవిడ్ వార్నర్, విరాట్ కోహ్లి, శిఖర్ ధావన్, శ్రేయస్ అయ్యర్, మహేంద్ర సింగ్ ధోని, రషీద్ ఖాన్, రిషబ్ పంత్, రుతురాజ్ గైక్వాడ్, సిఫర్ట్, మోయిన్ అలీ, సంజు శాంసన్, జేసన్ హోల్డర్, రవీంద్ర జడేజా, సూర్యకుమార్, ఇషాన్ కిషన్ తదితరులు ఈసారి మెగా టోర్నీకి ప్రత్యేక ఆకర్షణగా మారారు. మరోవైపు ఈసారి ఆస్ట్రేలియా స్టార్ వార్నర్‌పై అందరి దృష్టి నిలిచింది. ఈసారి మెరుగైన ఆట ద్వారా తానెంటో చాటాలనే పట్టుదలతో అతను ఉన్నాడు. అయ్యర్ కూడా అదే లక్షంతో పోరుకు సిద్ధమయ్యాడు. రాహుల్, మయాంక్ అగర్వాల్, హార్దిక్ పాండ్యలు ఈసారి ఆయా జట్లకు సారథ్యం వహిస్తున్నారు. తమకు అప్పగించిన బాధ్యతలను మెరుగ్గా నిర్వహించాలనే లక్షంతో వీరున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News