Sunday, May 5, 2024

ఉరి మళ్లీ వాయిదా

- Advertisement -
- Advertisement -

Nirbhaya convicts

 

న్యూఢిల్లీ: నిర్భయ దోషుల ఉరిశిక్ష మరోసారి వాయిదా పడింది. రాష్ట్రపతి వద్ద తన క్షమాభిక్ష పిటిషన్ పెండింగ్‌లో ఉన్నందున డెత్‌వారెంట్లపై స్టే ఇవ్వాలంటూ దోషుల్లో ఒకరైన పవన్ గుప్తా దాఖలు చేసిన పిటిషన్‌పై పటియాల హౌస్‌కోర్టు సోమవారం విచారణ చేపట్టింది. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు దోషులను ఉరి తీయవద్దంటూ తీహార్ జైలు అధికారులకు అడిషినల్ సెషన్స్ జడ్జి ధర్మేంద్ర రాణా ఆదేశాలు జారీచేశారు. మరోసారి డెత్‌వారెంట్లు ఇచ్చే వరకు ఉరి నిలుపుదల చేయాలని సూచించారు. మార్చి 3న (మంగళవారం) నలుగురు దోషులను ఉరితీయాలని ఇటీవల కొద్ది రోజుల కోర్టు డెత్‌వారెంట్లు జారీచేసిన విషయం తెలిసిందే. తాజాగా పటియాల కోర్టు శిక్ష అమలుపై స్టే ఇవ్వడంతో మూడోసారి ని ర్భయ దోషులకు శిక్ష అమలు వాయిదా పడినట్లయింది. ఇదే సమయ ంలో పిటిషనర్ తరపు న్యాయవాది ఎపి సింగ్‌తో పాటు పిటిషనర్ పవన్‌పై న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మీరు నిప్పుతో ఆడుకుంటున్నారు.

క్షమాభిక్ష అభ్యర్థన పెట్టుకోవడానికి ఇన్ని రోజులు ఎందుకు ఆ లస్యం చేశారు. ఒక వ్యక్తి(పవన్) చేసే చర్యల వల్ల ఎన్ని రకాల పరిణామాలను ఎదుర్కోవలసి వస్తుందో మీకు తెలియదా’ అని న్యాయమూర్తి ప్రశ్నించారు. అంతకుముందు పవన్ గుప్తా క్యురేటివ్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు సోమవారం తిరస్కరించింది. జస్టిస్ ఎన్‌వి రమణ సారథ్యంలోని ఐ దుగురు జడ్జీల ధర్మాసనం గుప్తా పిటిషన్‌పై ఇన్ ఛాంబర్ విచారణ జరిపి డిస్మిస్ చేసింది. మంగళవారం ఉరి అమలు నిలుపుదలకు స్టే ఇవ్వాలని కోరుతూ పవన్ దాఖలు చేసిన మరో పిటిషన్‌ను కూడా సుప్రీం ధర్మాస నం తోసిపుచ్చింది. ‘విచారణకోరుతూ దాఖలైన పిటిషన్‌ను తిరస్కరించా ం. ఉరి అమలుపై స్టే కోరుతూ వేసిన పిటిషన్‌ను కూడా తిరస్కరించాం. క్యురేటివ్ పిటిషన్‌ను తిరస్కరించాం’ అని జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్ ఆర్‌ఎఫ్ నారీమన్, జస్టిస్ ఆర్. భానుమతి, జస్టిస్ అశోక్ భూషణ్‌లతో కూడిన ధర్మాసనం సోమవారం తెలిపింది.

తన ఉరిశిక్షను జీవితఖైదుగా మార్చమని, ఉరిశిక్ష అమలుకు ట్రయల్ కోర్టు జారీచేసిన బ్లాక్ వారంట్‌పై స్టే ఇమ్మని కోరుతూ పవన్‌గుప్తా పెట్టుకున్న పిటిషన్లను అత్యున్నత న్యాయస్థానం కొట్టేసింది. నిర్భయ కేసులో నలుగురు దోషులు ముకేష్‌కుమార్ సింగ్ (32), పవన్‌గుప్తా (25), వినయ్‌కుమార్ శర్మ (26), అక్షయ్ ఠాకూర్ (31) లనుమార్చి 3 మంగళవారం ఉదయం 6 గంటలకు ఉరితీయాలని ఆదేశిస్తూ ట్రయల్ కోర్టు ఫిబ్రవరి 17న తాజాగా డెత్ వారెంట్లు జారీ చేసింది. ముగ్గురు దోషులు ముకేష్, వినయ్, అక్షయ్ పెట్టుకున్న క్షమాభిక్ష దరఖాస్తుల్ని రాష్ట్రపతి తిరస్కరించారు. దాన్ని సవాలు చేస్తూ ముగ్గురూ విడివిడిగా దాఖలు చేసుకున్న పిటిషన్లను అత్యున్నత న్యాయస్థానం అంతకు ముందే డిస్మిస్ చేసింది. కాగా, తన క్షమాభిక్ష పిటిషన్‌ను తిరస్కరించడంపై అక్షయ్ సవాల్ చేయలేదు. పవన్ ఇంతవరకూ రాష్ట్రపతికి క్షమాభిక్ష దరఖాస్తు పెట్టుకోలేదు.

కోర్టు సమయాన్ని వృథా చేస్తున్నారు: నిర్భయ తల్లి
‘వాళ్లు కోర్టు సమయాన్ని వృథా చేశారు. వ్యవస్థకు హాని చేయాలని చూశారు. వాళ్లకు రేపు ఉరి తప్పదు’ అని నిర్భయ తల్లి అంతకు ముందు చెప్పారు.‘ నేరస్థులు ఆటలాడేందుకు చట్టం ఇన్ని అవకాశాలిస్తుందా?’ అని ఆమె నిలదీశారు. ‘చట్టంతో వాళ్ల ఆటలు పూర్తయ్యాయి’ అని నిర్భయ తరఫు న్యాయవాది చెప్పారు.

Execution of Nirbhaya convicts has been postponed
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News